HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jasprit Bumrah Blames Batting After Edgbaston Loss In 5th Test

Bumrah: ఓటమికి బూమ్రా చెప్పిన కారణమిదే

ఇంగ్లాండ్ గడ్డపై నాలుగోసారి టెస్ట్ సిరీస్ గెలవాలనుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది.

  • Author : Naresh Kumar Date : 05-07-2022 - 8:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jasprit Bumrah
Jasprit Bumrah

ఇంగ్లాండ్ గడ్డపై నాలుగోసారి టెస్ట్ సిరీస్ గెలవాలనుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది. గెలుపు లేదా డ్రాగా ఖాయమనుకున్న బర్మింగ్‌హామ్ టెస్టులో ఇంగ్లాండ్ కౌంటర్ ఎటాక్ ఎవ్వరూ ఊహించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులే ఆలౌటై భారత్‌కు 132 రన్స్ ఆధిక్యాన్ని సమర్పించుకున్నా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవడం ఆశ్చర్యమే. ఓపెనర్లతో పాటు జో రూట్, జానీ బెయిర్ స్టో దూకుడైన బ్యాటింగ్‌కు ఆతిథ్య జట్టుకు విజయాన్నందించింది. చివరిరోజు తొలి సెషన్‌ అది కూడా కేవలం 20 ఓవర్లలోనే 129 పరుగుల బ్యాలెన్స్ టార్గెట్‌ను పూర్తి చేసిందంటే వారి జోరు ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపై తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా మాట్లాడాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే ఓటమికి కారణమన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో మూడురోజుల పాటు బాగా ఆడినా నాలుగోరోజు సరిగా ఆడకుంటే ఫలితం ఇలాగే ఉంటుందన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడిందన్నాడు. ఇక సిరీస్ ఫలితంపైనా బూమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరీస్ తొలి మ్యాచ్‌లో వర్షం పడకుండా ఉంటే తామే గెలిచేవాళ్ళమన్నాడు.

తర్వాతి మ్యాచ్‌లలో భారత్ బాగా ఆడిందని, అయితే చివరి టెస్టులో నాలుగో రోజు ఆట మ్యాచ్‌ను మలుపుతిప్పిందన్నాడు. సిరీస్‌లో రెండు జట్లూ బాగా ఆడాయని, ఇది సరైన ఫలితమేనని అభిప్రాయపడ్డాడు. అటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో కలిసి సారథిగా పనిచేయడంపైనా బూమ్రా స్పందించాడు. జట్టులో ఆటగాళ్ళందరినీ గైడ్ చేయడానికి, సపోర్ట్ చేసేందుకు ద్రవిడ్ ఎప్పుడూ ముందే ఉంటాడని చెప్పుకొచ్చాడు. టీమిండియాను లీడ్ చేసే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bumrah
  • Bumrah Blames
  • Edgbaston
  • england vs india
  • Jasprit Bumrah

Related News

Gautam Gambhir replied to MS Dhoni's

MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన

  • Hanuman Temple

    హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd