IPL 2022: ఐపీఎల్ 2022 నుంచి జాసన్ రాయ్ ఔట్
ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయ బోతున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ జాసన్ రాయ్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
- By Hashtag U Published Date - 11:19 PM, Tue - 1 March 22

ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయ బోతున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ జాసన్ రాయ్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు.
బయో బబుల్ సమస్యల కారణంగా కారణంగా మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్15 వ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.2 కోట్లకు జాసన్ రాయ్ ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఇక తన ఐపీఎల్ కెరీర్లో 13 మ్యాచ్ లు ఆడిన జాసన్ రాయ్ 329 పరుగులు సాధించాడు.. ఐపీఎల్ లో జాసన్ రాయ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు.
ఇదిలావుంటే.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టును కొనుగోలు చేసింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను నియమించింది.. అలాగే గుజరాత్ టైటాన్స్.. అప్గణిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను, టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లను మరో ఇద్దరు డ్రాఫ్టెడ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసుకుంది. అలాగే మెగా వేలంలో రాహుల్ తేవాటియా, ఫెర్గూసన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాతియా వంటి స్టార్ ప్లేయర్లను దక్కించుకుంది.. ఈ మెగా వేలంలో 52 కోట్లు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
Pic Credit – Twitter