HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jagtial District Wall Posters Threatening Sorcerers Create Panic

Jagtial Viral Posters: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. ఒక్కొక్కరిని చంపుతాం.. ముందు ఎవరంటే..?

Jagtial Viral Posters: జగిత్యాల లో మంత్రగాళ్లారా తస్మాత్‌ జాగ్రత్త అంటూ వాల్ పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. ప్రజ మంచికోరే సంస్థ పేరిట పోస్టర్లు వెలిశాయి. గచ్చునూతి దగ్గరి నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు.

  • Author : Kavya Krishna Date : 15-10-2024 - 12:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagtial Posters
Jagtial Posters

Jagtial Viral Posters: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో “మంత్రగాళ్లారా తస్మాత్‌ జాగ్రత్త” అంటూ వాల్ పోస్టర్లతో భారీ కలకలం రేగింది. “ప్రజ మంచికోరే సంస్థ” పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు. ఈ పోస్టర్లలో గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న మంత్రగాళ్లను చంపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. చ్చునూతి దగ్గర మొదలుపెట్టి, గుండ్లవాడ, గౌండ్లోల్లు వంటి గ్రామాల్లోని మంత్రగాళ్లను టార్గెట్ చేస్తామని చెప్పారు.

హెచ్చరికల వివరాలు:

‘గ్రామ మంత్ర గాళ్లరా తస్మాత్ జాగ్రత్త… మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్ర గాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం. ఆ పని గచ్చు నూతి దగ్గర ఉన్న ఇద్దరి మంత్ర గాల్ల తో మొదలు పెడతాము ఆ తరువాత గుండ్ల వాడ కట్టు, గోలొల వాడ కట్టు, గౌండ్లోల్లు, పాల కేంద్రం చుట్టూ పక్కల , మాల మాదిగల వాడ కట్టులో వున్న మంత్రగాళ్లు అందరినీ చంపుతం.. ఎవరు ఎప్పుడు ఎలా చేస్తారో మాకే తెలియదు. గ్రామ ప్రజలకు మనవి ఇప్పటి వరకు మీరు చూస్తూ ఎలా వున్నారో అలాగే వుండండి అలా కాకుండా మంత్ర గాళ్ళకు సపోర్ట్ చేశారో మీకు కూడా ప్రాణపాయం వుండొచ్చు అనేక మంది అనేక బాధలు పడుతూనే వున్నారు ఈ మంత్ర గాల్లా వల్ల ఇట్టు ప్రజల మంచికోరే సంస్థ’ అంటూ వాల్ పోస్టర్ వెలిసింది.

RG Kar Case : 11వ రోజుకు చేరుకున్న వైద్యుల నిరాహార దీక్ష.. నేడు ఆర్‌జీ కర్ కేసుపై విచారణ

పోస్టర్లు రెడ్ పెన్నుతో రాసి అతికించబడటం ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. ఇది చూసిన స్థానికులు భయపడిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగారు. పోస్టర్లను తొలగించి, దీనిపై దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రజలకు పోలీసుల సూచనలు: పోలీసులు ఈ పోస్టర్లను పరిశీలించి ప్రజలను భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఎలాంటి అనుమానస్పద కార్యకలాపాలు కనిపించినా లేదా అనుమానాలు వచ్చినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

తరచూ పునరావృతం:

ఇదే తరహా సంఘటన రెండున్నరేళ్ల క్రితం కూడా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అప్పటి నుండి మంత్రగాళ్లపై స్థానిక ప్రజల్లో నిరసనలు, భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ తరహా హెచ్చరికలు బయటకు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోస్టర్ల వెనుక ఎవరు? పోస్టర్ల వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఈ హెచ్చరికలు ఎందుకు వెలువడుతున్నాయన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంత్రగాళ్లకు సంబంధించి ఉన్న ప్రజల అభిప్రాయాలు, వారిపై వస్తున్న ఫిర్యాదులు, ఇలాంటి వారిపై భయాలు కలగడంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రజల భయాందోళనలు: గ్రామాల్లో ఉన్న మంత్రగాళ్లు ఎలాంటి ప్రళయం సృష్టిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామాల్లో పరిస్థితి గందరగోళంగా మారింది.

Meat: మాంసం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagtial
  • Medipalli
  • police investigation
  • Public Panic
  • Sorcerers
  • telangana
  • Threat Posters
  • Village Tensions
  • Wall Posters

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Major twist in the Jnaneshwari disappearance case...

    jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd