Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్
ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
- Author : Latha Suma
Date : 13-03-2025 - 4:38 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ గురయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు. స్పీకర్ పదవికి భంగం కలిగేలా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సభలో ప్రకటించారు.
Read Also: Tamil Nadu : రూపాయి సింబల్‌ను మార్చేసిన తమిళనాడు సర్కారు
గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ను ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, సీతక్క. స్పీకర్ నీ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నారు. సభ్యులను ఉద్దేశించి మీరు ముసుకోండి.. అని జగదీష్ రెడ్డి అన్నట్టు ఆడియో రికార్డు అయ్యిందంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వీడియోను పరిశీలించిన తర్వాత ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. ఇక, సభ తిరిగి మధ్యాహ్నం ప్రారంభం కావడంతో జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా.. ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీకి సిఫార్స్‌లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు.
Read Also: YV Vikrant Reddy : వైవీ విక్రాంత్‌రెడ్డి ఎవరు ? ఆయనపై అభియోగాలు ఏమిటి ?