Valentines Week: ఎక్స్ వైఫ్ తో మళ్ళీ అలా.. హృదయం చలించే ఘటన!
ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.. ప్రేమికుల వారోత్సవం . అదేనండీ.. వాలంటైన్స్ వీక్. కాబట్టి ఊపు మీదున్న ప్రేమ జంటలన్నీ వేడుకల్లో మునిగిపోయాయి.
- By Anshu Published Date - 08:31 PM, Thu - 9 February 23

Valentines Week: ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.. ప్రేమికుల వారోత్సవం . అదేనండీ.. వాలంటైన్స్ వీక్. కాబట్టి ఊపు మీదున్న ప్రేమ జంటలన్నీ వేడుకల్లో మునిగిపోయాయి. ఇక రోజుకో ప్రత్యేకతతో స్పెషల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేమికులు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వింత ఘటనలు, ఇంకా ఇతర ఆశ్చర్యం కలిగించే కొన్ని ఘటనలు చూస్తూ ఉంటాము. కానీ ఇది మాత్రం మీ హృదయాన్ని స్పృశించే సంఘటన. ఈ భర్తను చూస్తే మీ హృదయం ద్రవీభవించక మానదు.
సోషల్ సోషల్ మీడియాలో వాలంటైన్స్ డే ట్రెండ్ అవుతున్న ఈ సమయంలో.. మనసును హత్తుకునే ఈ ప్రేమ కథ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాను తన మాజీ భార్య.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న సమయంలో.. ఆ వ్యక్తి అందించిన భరోసా అందర్నీ కదిలిస్తోంది. తన మాజీ భార్యను ఆదుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా? అందరూ అదే షాక్ అవుతున్నారు. ఇక ఆ వివరాలేంటో మీరే చదవండి.
ఒక వ్యక్తి.. అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతోన్న మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ విషయం ఆ వ్యక్తికి తెలియదు. ఇక ఇటీవల ఆమేతో మనస్పర్థల నేపథ్యంలో వారిద్దరూ విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆ వ్యక్తికి తన భార్యకు ఆ వ్యాధి ఉండనే విషయమే తనకు తెలియదు. కానీ విభేదాల కారణంగా మూడేళ్ల క్రితమే విడిపోయారు. ఇక తాజాగా తన భార్యకున్న వ్యాధి గురించి తెలుసుకున్న భర్త చెలించి పోయాడు. దానితో అతడు తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
“ఇప్పటికీ మేం ఒకే ఇంటిని షేర్ చేసుకుంటున్నాం. మా విడాకుల నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది. తన వ్యాధి గురించి తెలిసిన తర్వాత… నేను ఆమెకు మళ్లీ ప్రపోజ్ చేశాను” అని ఆ వ్యక్తి వెల్లడించాడు. ఇక ఈ నిర్ణయంతో వారు రెండోసారి వివాహం చేసుకునేందుకు చట్టపరంగా దరఖాస్తు చేసుకున్నారు. ఆమెను మళ్ళీ వివాహం చేసుకుని హాస్పిటల్లో చేర్చాడు. “ఇతరుల వివాహాలు ఆనందభరితంగా ఉంటాయి. కానీ మాకు మాత్రం కన్నీరు ఆగలేదు. ఆ వెంటనే ఆసుపత్రికి పరుగెత్తాం” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.