Hyderabad Rains: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ట్రాఫిక్ ఆంక్షలు ఇవే
పది రోజులుగా హైద్రాబాద్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ లో పడిగాపులు కాస్తున్నారు
- By Praveen Aluthuru Published Date - 08:15 AM, Wed - 26 July 23

Hyderabad Rains: పది రోజులుగా హైద్రాబాద్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ లో పడిగాపులు కాస్తున్నారు. తాజాగా ఐఎండీ ఇచ్చిన సమాచారం ప్రకారం హైద్రాబాద్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక హైద్రాబాద్లోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా తలెత్తుతుంది. ఈ మేరకు నగర పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఏ ఏ కంపెనీలు ఏ సమయానికి లాగౌట్ చేయాలో సూచించారు.
IKEA నుండి సైబర్ టవర్స్ రోడ్ వరకు ఉన్న కంపెనీలు సాయంత్రం 3 గంటలకు ఉద్యోగులు లాగౌట్ చేసి ఇళ్లకు బయల్దేరాలని సూచించారు. ఈ దారిలో ఉన్న రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న అన్ని కంపెనీలు టిసిఎస్, HSBC,డెల్,ఫియోనిక్స్ (మాదాపూర్ / కొండాపూర్ అవాన్స్)లో ఉన్న అన్ని కంపెనీలు.డెల్, ఒరాకిల్ 8. క్వాల్కమ్,టెక్ మహీంద్రా, పర్వా సమ్మిట్, వాటర్‌మార్క్‌లో ఉన్న అన్ని కంపెనీలు 3 గంటలకు లాగౌట్ చేయాలనీ ఆదేశించారు పోలీసులు.
IKEA మరియు బయో డైవర్సిటీ & రాయదుర్గం చుట్టూ ఉన్న నాలెడ్జ్ సిటీలో ఉన్న అన్ని కంపెనీలు, నాలెడ్జ్ పార్క్, 3.7 హబ్‌లో ఉన్న అన్ని కంపెనీలు, గెలాక్సీ, Twitzaలో ఉన్న అన్ని కంపెనీలు, Commerzimeలో ఉన్న అన్ని కంపెనీలు . RMZ నెక్సిటీలో ఉన్న అన్ని కంపెనీలు, స్కైవ్యూ 10 & 20లో ఉన్న అన్ని కంపెనీలు, దివ్యశ్రీ ఓరియన్‌లో ఉన్న అన్ని కంపెనీలు సాయంత్రం 4.30 గంటలకు బయటకు రావాలని సూచించారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ / గచ్చిబౌలిలో ఉన్న మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సెంటారస్, బ్రాడ్‌వే, వర్చ్యుశ, మరియు వేవ్ రాక్ లో ఉన్న అన్ని కంపెనీలు, అమెజాన్,హనీవెల్, హిటాచీ, క్యాప్ జెమిని, ఫ్రాంక్డిన్ టెంపుల్టన్, Q సిటీలో ఉన్న అన్ని కంపెనీలు, DLFలో ఉన్న అన్ని కంపెనీలు సాయంత్రం మూడు గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో లాగౌట్ చేయాలనీ కోరారు.
Also Read: Vastu tips: ఇంటి మెయిన్ డోర్ వద్ద ఈ 5 మొక్కలు ఉంచితే చాలు.. ఐశ్వర్యం, సంపద మీ వెంటే?