HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Is Russian President Putin Health Critical

Putin Health: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో మూడేళ్లకు మించి బతకరా? నిజమేంటి?

రష్యా-ఉక్రెయిన్ యుద్దం మొదలవ్వకముందే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆరోగ్యంపై యూరప్ దేశాలతోపాటు మరికొన్ని దేశాలు సంచలన కథనాలు వెలువరుస్తున్నాయి.

  • Author : Hashtag U Date : 30-05-2022 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Putin Agrees To China Visit
Putin

రష్యా-ఉక్రెయిన్ యుద్దం మొదలవ్వకముందే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆరోగ్యంపై యూరప్ దేశాలతోపాటు మరికొన్ని దేశాలు సంచలన కథనాలు వెలువరుస్తున్నాయి. రష్యా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా సరే.. ఈ కథనాలకు అడ్డే లేకుండా పోయింది. ఇప్పుడు కూడా అలాంటిదే బయటకు వచ్చింది. పుతిన్ క్యాన్సర్ తో తీవ్రంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి అయిన బోరిస్ కార్పిచ్కోవ్ పుతిన్ ఆరోగ్యంపై కీలక ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. పుతిన్ రెండు నుంచి మూడేళ్లకు మించి బతకరని.. వైద్యులు చెప్పినట్టుగా ఈ ప్రకటన ఉంది.

పుతిన్ కు తీవ్రమైన తలనొప్పి వస్తోందని, నెమ్మదిగా కంటి చూపు కూడా సన్నగిల్లుతోందని.. క్యాన్సర్ పెరిగిందని.. అందుకే ఆయన ఆరోగ్యం క్షిణిస్తున్నట్టు ఆ ప్రకటనలో ఉంది. సమావేశాలను పూర్తిచేయకుండా మధ్యలోనే వెళ్లిపోతున్నారని.. ప్రసంగాల కోసం అక్షరాలను పెద్దగా రాసివ్వాల్సి వస్తోంది అన్నారు. పైగా ఈమధ్య కాళ్లు, చేతులు కూడా వణుకుతున్నాయని అందుకే ఆయన మరో మూడేళ్లకు మించి బతకరని వైద్యులు అంచనా వేసినట్లు ఆ ప్రకటన చెబుతోంది.

పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులు పెరిగిపోవడంతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ వాటిని తీవ్రంగా ఖండించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఆయనకు ఎలాంటి వ్యాధి లేదని.. అలాంటప్పుడు ఇలాంటి ప్రచారం తగదని హితవు పలికారు. పుతిన్ కు వచ్చే అక్టోబర్ నాటికి 70 ఏళ్లు పూర్తవుతాయి. అయినా సరే ఆయన ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీపడరు. పైగా ఎప్పుడూ ఏదో కార్యక్రమంలో కనిపిస్తూనే ఉన్నారు కదా అని ఆయన చెప్పారు. దీంతో పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టడానికి ప్రయత్నించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • putin health
  • russia
  • viral
  • Vladimir Putin

Related News

Chiru Anna

Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

ప్రస్తుతం ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. "మెగాస్టార్ టైమింగ్ ముందు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు

  • Russia

    ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

Latest News

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

  • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd