HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ipl 2022 Glenn Maxwell Joins Rcb Camp

IPL 2022: మాక్స్ వెల్ వచ్చేశాడు

  • Author : Naresh Kumar Date : 04-04-2022 - 3:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maxvell
Maxvell

ఐపీఎల్ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. తన పెళ్లి కారణంగా సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లు మిస్‌ అయిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. ఏప్రిల్‌ 5న రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్‌ నాటికి సిద్ధంగా ఉంటాడని ఆర్సీబీ యాజమాన్యం వెల్లడించింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ లో బరిలోకి దిగేందుకు మ్యాక్సీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించాడు.. అయితే ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కూడా గ్లెన్‌ మాక్స్‌వెల్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 2021 సీజన్‌లో బెంగళూరు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ను బెంగళూరు ఫ్రాంచైజీ పట్టుబట్టి మరీ 11 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఇక ఐపీఎల్‌-2022 సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన ఆర్సీబీ జట్టు.. బుధవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించి బోణీ కొట్టింది… ఈ క్రమంలోనే మూడో మ్యాచ్‌లో కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌, మాజీ సారథి విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ , వానిందు హసరంగా వంటి మ్యాచ్ విన్నర్లతో ఉన్న ఆర్సీబీ జట్టులో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ చేరికతో మరింత పటిష్టంగా మారనుంది. మాక్స్‌వెల్‌ ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టాడు. భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను అతడు మార్చి 18న వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లపాటు ప్రేమించుకున్న మ్యాక్సీ, వినీ రామన్‌లు క్రైస్తవ, తమిళ సాంప్రదాయ పద్ధతుల్లో రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengaluru
  • cricket
  • glen maxwell
  • IPL 2022

Related News

Bengaluru Gas Charge Added By Hotels Amid LPG Shortage

ఇడ్లీ, వడ తో పాటు గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలి..

Bengaluru Gas Charge Added By Hotels Amid LPG Shortage  పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లోని సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. వంటింట్లో గ్యాస్ లేక హోటల్‌కు వెళ్లి తినాలనుకుంటే.. హోటల్ బిల్లుల్లోనూ మంటలు పుట్టిస్తూ సాధారణ ప్రజలు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతను సాకుగా చూపి కొన్ని హోటళ్లు కస్టమర్ల నుంచి ముక్కుపిండి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగ

  • Kuldeep Yadav Marriage

    కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

  • Sambar Fight

    Bengaluru : భార్య భర్తల మధ్య సాంబార్ గొడవ.. ఏకంగా ప్రాణాలు పోయేలా చేసింది

  • Gautam Gambhir replied to MS Dhoni's

    MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd