National Unity Day : సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలోని ఆసక్తికర విశేషాలివీ..
National Unity Day : ఇవాళ జాతీయ ఐక్యతా దినోత్సవం. దేశ తొలి హోంమంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబర్ 31 న ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ జరుపుకుంటారు.
- By Pasha Published Date - 09:03 AM, Tue - 31 October 23

National Unity Day : ఇవాళ జాతీయ ఐక్యతా దినోత్సవం. దేశ తొలి హోంమంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబర్ 31 న ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ జరుపుకుంటారు. దీనిపై 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటన చేశారు. అప్పటి నుంచి ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం. 550 కంటే ఎక్కువ రాచరిక సంస్థానాలను దేశంలో కలపడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి వేడుకలను మనం జరుపుకుంటున్నాం.
We’re now on WhatsApp. Click to Join.
- సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు.
- హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఈయనదే.
- ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి.. జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.
- బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేశారు.
- 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు.
- భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు.
- స్వాతంత్ర్యానంతరం జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలిలో హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధాన మంత్రిగానూ బాధ్యతలను నిర్వహించారు.
- దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశారు.
- 1950 డిసెంబరు 15న సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్నుమూశారు.
- తుదిశ్వాస విడిచిన 4 దశాబ్దాల తర్వాత 1991లో భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించింది.
- 182 మీటర్ల ఎత్తు ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో 2018 అక్టోబరు 31న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరించారు.