Indigo Flight: ఇండిగో విమానం ఇంజన్ ఫెయిల్.. అత్యవసర ల్యాండింగ్ చేసిన లోకో పైలెట్?
సాధారణంగా విమానాలు గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఫ్లైట్ లో అంతరాయ లోపం వల్ల కొన్ని కొన్ని సార్లు అత్యవసర లాండింగ్ చే
- Author : Anshu
Date : 21-06-2023 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా విమానాలు గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఫ్లైట్ లో అంతరాయ లోపం వల్ల కొన్ని కొన్ని సార్లు అత్యవసర లాండింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇతర కారణాల వల్ల కూడా ఫ్లైట్ ను ఎమర్జెన్సీగా లాండింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే గతంలో చాలా సార్లు ఇలా ఫ్లైట్ లను అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. టెక్నికల్ ఇష్యూస్ వల్లనే కాకుండా వివిధ రకాల కారణాల వల్ల ఫ్లైట్ లను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలట్స్.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండిగో విమానం కూడా ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దాంతో భారీ ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే.. బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి తాజాగా ఒక భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్ లోపాన్ని గుర్తించిన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించారు. పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు.
అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా ప్రమాదం నుంచి బయట పడడంతో పాటు అందరూ క్షేమంగా ఉన్నారు. నేడు అనగా బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ టర్న్‌బ్యాక్‌కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.