Indigo Tail Strike: ల్యాండింగ్ సమయంలో ఇండిగో టెయిల్ స్ట్రైక్
ఇండిగో విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా నేలను (టెయిల్ స్ట్రైక్) ఢీకొట్టింది. ఏప్రిల్ 14న ముంబై నుంచి నాగ్‌పూర్‌కు వస్తుండగా
- Author : Praveen Aluthuru
Date : 18-04-2023 - 12:37 IST
Published By : Hashtagu Telugu Desk
Indigo Tail Strike: ఇండిగో విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా నేలను (టెయిల్ స్ట్రైక్) ఢీకొట్టింది. ఏప్రిల్ 14న ముంబై నుంచి నాగ్‌పూర్‌కు వస్తుండగా 6E 203 నంబర్‌తో కూడిన విమానం రిపేరు నిమిత్తం నాగ్‌పూర్ విమానాశ్రయంలో నిలిపివేసినట్లు ప్రకటించారు.
ఇండిగో విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 14 ఏప్రిల్ 2023 న ముంబై నుండి వచ్చిన ఫ్లైట్ నంబర్ 6E 203 నాగ్‌పూర్‌లో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు నేలను ఢీకొట్టింది. మరమ్మతుల నిమిత్తం నాగ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. సాధారణంగా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ భూమిని తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది.
గతంలో జరిగిన ప్రమాదాలు:
ఇండిగో విమానంలో ఇది మొదటి సంఘటన కాదు. ఇదివరకు చాలానే ప్రమాదాలు జరిగాయి. . అంతకుముందు జనవరి 4, 2023న కోల్‌కతాలో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం తోకను ఏదో ఢీకొట్టింది. విమానం అడుగు భాగంలో గీతలు ఉన్నాయి. మరమ్మత్తుల నిమిత్తం విమానాన్ని కోల్‌కతాలో నిలిపివేసినట్లు ప్రకటించారు. మరో ఘటనలో విమానం టేకాఫ్ సమయంలో మంటలు చెలరేగాయి. ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ఢిల్లీ-బెంగళూరు ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.