Internet Economy: 1 ట్రిలియన్ డాలర్ లకు చేరనున్న ఇంటర్నెట్ ఎకానమీ?
భారతదేశంలో డిజిటల్ విప్లవం వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా నిలిచిన విషయం తెలిసిందే. డిజిటల్ లావాద
- By Anshu Published Date - 05:12 PM, Wed - 14 June 23

భారతదేశంలో డిజిటల్ విప్లవం వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా నిలిచిన విషయం తెలిసిందే. డిజిటల్ లావాదేవిల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది భారత్. కాగా రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది భారత్. మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవి, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ఆరు రెట్లు వృద్ధి చెంది ట్రిలియన్ డాలర్ లకు చేరుకోగలదని, వచ్చే ఏడేళ్లలో కుటుంబాలు వారి ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నాయని గూగుల్ టెమాసిక్, బైన్ కంపెనీ తెలిపింది. కాగా 2030 లో భారతదేశ జీడీపీలో ఇంటర్నెట్ ఎకానమీ వాటా 4 నుంచి 5 శాతం 12 నుంచి 13 శాతానికి పెరుగుతుందని 350 మిలియన్ల డిజిటల్ చెల్లింపు దారులు, 250 మిలియన్ల ఆన్లైన్ షాపర్లు ఈ వృద్ధికి కారణమవుతారని నివేదిక తెలిపింది. భారతదేశ సాంకేతిక రంగానికి ఇంటర్నెట్ ఎకానమీ సహకారం 2022లో 48 శాతం ఉంటే 2030కి 62 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
కాగా వినియోగదారుల్లో వచ్చిన మార్పులు బిజినెస్ ఎకో సిస్టం పరిమాణం కారణంగా 2022లో సుమారు 175 బిలియన్ల వినియోగం నుంచి భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ దిశగా తీసుకుపోతుందని ది ఇ- కానమీ ఆఫ్ ఎ బిలియన్ కనెక్టెడ్ ఇండియన్స్ నివేదికలో తెలిపింది. 2030 నాటికి కుటుంబ ఆదాయం 25000 డాలర్ల నుంచి 5500 డాలర్లకి పెరిగి డబుల్ అవుతుందని అంచనా వేశారు. వినియోగదారులు పెట్టుబడిదారులు సర్వేతో పాటు బైన్ అండ్ కంపెనీ విశ్లేషన ప్రకారం టైర్ 2 నగరాలు టైర్ వన్ మెట్రో నగరాలకు సమానంగా డిజిటల్ సేవల డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది.