Canada Road Accident : కెనడాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్థి మృతి
- Author : Prasad
Date : 28-11-2022 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
కెనడాలోని టొరంటోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా స్టూడెంట్‌ని ట్రక్ ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. మృతి చెందిన విద్యార్థి కార్తీక్‌గా అక్కడి పోలీసులు గుర్తించారు. కార్తీక్ ఆగష్టు 2021లో ఇండియా నుంచి కెనడాకు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.షెరిడాన్ కాలేజీ కార్తీక్ చదువుతున్నాడు. కార్తీక్ ఆకస్మిక మరణం పట్ల కాలేజీ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.