HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Will Play For Saving Grace

3rd ODI: భారత్ పరువు దక్కేనా…?

దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌లో జరగనున్న ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది.

  • Author : Hashtag U Date : 23-01-2022 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India Cricket
Team India Cricket

దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌లో జరగనున్న ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది.తొలిరెండు వ‌న్డేల్లో జ‌రిగిన త‌ప్పుల‌ను ఈ మ్యాచ్‌లో పున‌రావృతం చేయ‌కూడ‌ద‌ని భావిస్తోంది.

ముఖ్యంగా బ్యాటింగ్‌లో మిడిలార్డ‌ర్ రాణించాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. తొలి వ‌న్డేలో టాపార్డ‌ర్ రాణించిన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్ చేతులెత్తేయ‌డంతో భార‌త్ ఓట‌మి పాలైంది. అలాగే రెండో వన్డేలో రిషబ్ పంత్‌ మినహా తేలిపోయిన బ్యాటింగ్‌తో ముందుగా సాధారణ స్కోరుకే పరిమితమవగా… ఆపై బౌలింగ్‌ పూర్తిగా నిరాశపరచింది. పేలవ బౌలింగ్ తో ఒకదశలో వికెట్‌ తీయడమే గగనంగా మారిపోయింది.

అందుకే ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో జట్టు సమష్టిగా రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక ఏముందో వన్డేలో బరిలోకి దిగే భారత తుది జ‌ట్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ ప‌లు మార్పులు చేసే అవ‌కాశం ఉంది. బెంచ్‌లో ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్‌ని జ‌ట్టులోకి తీసుకునే ఆలోచ‌న‌ను కూడా చేస్తోంది. అదే జ‌రిగితే శ్రేయ‌స్ అయ్య‌ర్ పై వేటు పడొచ్చు. అటు రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికర అంశం. ఇక బౌలింగ్‌లో ప‌లు మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

తొలి రెండు వన్డేల్లో ప‌రుగులు ఎక్కువ‌గా ఇచ్చిన సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ స్థానంలో యువ పేస‌ర్ ప్రసాద్ క్రిష్ణ జ‌ట్టులోకివ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే తొలి రెండు వ‌న్డేల్లో విఫ‌ల‌మైన‌ స్పిన్న‌ర్‌అశ్విన్ స్థానంలో జ‌యంత్ యాద‌వ్‌ను జ‌ట్టులో తీసుకోవ‌చ్చు. ఇకవిరామం లేకుండా మ్యాచులు ఆడుతున్న సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ లో విశ్రాంతినిస్తే మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రానున్నాడు.

Cover Pic Courtesy- BCCI/Twitter


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3rd ODI
  • Mohd Siraj
  • Ruturaj Gaikwad
  • south africa
  • South Africa won the series
  • surya kumar yadav
  • team india

Related News

Test Squad

టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

నంబర్ 3 స్థానంలో వరుస అవకాశాలు ఇచ్చినప్పటికీ సాయి సుదర్శన్ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో సెలక్షన్ కమిటీ అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది.

    Latest News

    • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

    • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

    • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

    • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd