HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Vs West Indies 2nd T20 Preview Can The Tourists Hit Back

T20: సిరీస్ పట్టేస్తారా ?

సొంత గడ్డ పై మరో సీరీస్ విజయంపై టీమ్ ఇండియా కన్నేసింది.

  • Author : Hashtag U Date : 18-02-2022 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team India vs WI
Team India vs WI

సొంత గడ్డ పై మరో సీరీస్ విజయంపై టీమ్ ఇండియా కన్నేసింది. విండీస్ తో తొలి టీ ట్వంటీలో అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇప్పుడు సిరీస్ గెలవడమే లక్ష్యంగా రెండో మ్యాచ్ కు సిద్ధమయింది.అయితే రెండో టీ20 మ్యాచ్ కు ముందు టీమిండియాను గాయాలు కలవరపెడుతున్నాయి.. యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్, యువ పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరంగా ఉండనున్నారు.. వారి స్థానాల్లో దీపక్ హుడా, శార్ధూల్ ఠాకూర్, తుదిజట్టులోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అలాగే తొలి మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. భువికి ఈ సీరీస్ కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో తుది జట్టు నుంచి తప్పించే సాహసం చేయకపోవచ్చు.

అటు బ్యాటింగ్ లో రోహిత్ శర్మ తో కలిసి యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.. అలాగే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు రానుండగా.. నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్, ఐదో స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నారు. తొలి టీ20లోను విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను రాణించాల్సి ఉంది. ఇక రిషభ్ పంత్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. అతను కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.

కాగా ఈ మ్యాచ్ లో స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా యజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ మరోసారి బరిలోకి దిగనున్నారు. అరంగేట్రం లోనే అదరగొట్టిన రవి బీష్ణోయ్ పై మరోసారి అంచనాలు నెలకొన్నాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం జట్టును సన్నద్ధం చేసే క్రమంలో ఆల్ రౌండర్ గా దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఆడించే అవకాశం ఉంది. మరోవైపు సీరీస్ చేజారకుండా ఉండాలంటే విండీస్ కు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. టీ ట్వంటీ ఫార్మాట్ లో చెలరేగి ఆడే విండీస్ ఆటగాళ్ళు కనీస పోటీ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్య పరుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs WI
  • India vs west indies
  • rohit sharma
  • T20 preview
  • team india

Related News

Rohit Sharma breaks silence on retirement: 'I am not leaving...'

Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

లార్డ్స్‌లో తన 34వ వన్డే సెంచరీతో రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ వదంతులను తోసిపుచ్చారు, 2027 ప్రపంచ కప్ గెలవడంపైనే తన దృష్టిని ఉందని పునరుద్ఘాటించారు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన వన్డేకు ముందు తనను వెంటాడిన రిటైర్మెంట్ గుసగుసలకు రోహిత్ శర్మ ఒక చమత్కారమైన సమాధానం సిద్ధం చేసుకున్నారు: “గోల లేకపోతే సరదా ఉండదు”. ఈ మ్యాచ్‌తో అతని వన్డే కెరీర్ ముగియవచ్చని వార్తలు వస్తున్

  • BCCI refutes reports regarding Rohit Sharma's retirement.

    Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను ఖండించిన బీసీసీఐ

  • Rohit Sharma's retirement...?

    Rohit Sharma: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌..? ఇంగ్లాండ్‌తో చివరి వన్డే

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd