HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄India Vs Australia 1st Odi Update Indian Bowlers Well Played Australia All Out For 188 Runs

Australia All Out: సత్తా చాటిన భారత బౌలర్లు.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్!

తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుని 188 పరుగులకే భారత్ జట్టు కుప్పకూల్చింది.

  • By Balu J Published Date - 05:44 PM, Fri - 17 March 23
Australia All Out: సత్తా చాటిన భారత బౌలర్లు.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్!

ముంబయిలోని వాంఖడే వేదికగా శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుని 188 పరుగులకే భారత్ జట్టు కుప్పకూల్చింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు ఇన్నింగ్స్ 20వ ఓవర్ నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. ఎంతలా అంటే? ఒకానొక దశలో 128/2తో ఉన్న ఆస్ట్రేలియా టీమ్ చివరికి 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అలానే రవీంద్ర జడేజాకి రెండు, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్‌కి ఒక్కో వికెట్ దక్కింది.

ఫ్యామిలీ రీజన్స్‌తో ఈ వన్డేకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దాంతో తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ గెలిచి.. ఆస్ట్రేలియాని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే.. ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5) ఆరంభంలోనే సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డవగా.. అనంతరం వచ్చిన స్టీవ్‌స్మిత్ (22), మార్కస్ లబుషేన్ (15) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.

కానీ.. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మిచెల్ మార్ష్ (81: 65 బంతుల్లో 10×4, 5×6) దూకుడుగా ఆడేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటంతో తక్కవ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా ఆసీస్ 200 పరుగుల లోపే ఆలౌట్ అయ్యింది. అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో విరాట్ కోహ్లీ తోటి ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ జోష్ నింపాడు. అయితే ఆస్ట్రేలియా వికెట్ పడిన సందర్భంలో విరాట్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం అందర్నీ ఆకట్టుకుంది.

Telegram Channel

Tags  

  • 1st ODI
  • all out
  • australia
  • team india
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Kohli’s Fitness: కోహ్లీ ఫిట్ నెస్ సీక్రెట్ ఎంటో తెలుసా!

Kohli’s Fitness: కోహ్లీ ఫిట్ నెస్ సీక్రెట్ ఎంటో తెలుసా!

ప్రతిరోజూ జిమ్ లో గంటల తరబడి గడిపే విరాట్ కొహ్లీ..ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతాకాదు.

  • Team India: టీం ఇండియా క్రికెట్ కు గట్టి దెబ్బ… ర్యాంకులు కూడా కోల్పోయారుగా !

    Team India: టీం ఇండియా క్రికెట్ కు గట్టి దెబ్బ… ర్యాంకులు కూడా కోల్పోయారుగా !

  • India vs Australia: మేలుకోకుంటే కష్టమే.. ఆసీస్‌పై సిరీస్ ఓటమి ఓ గుణపాఠం..

    India vs Australia: మేలుకోకుంటే కష్టమే.. ఆసీస్‌పై సిరీస్ ఓటమి ఓ గుణపాఠం..

  • Snake on Bed: మంచం పై పడుకున్న 6 అడుగుల పాము.. చూసి షాక్ అయిన ఆస్ట్రేలియా మహిళ

    Snake on Bed: మంచం పై పడుకున్న 6 అడుగుల పాము.. చూసి షాక్ అయిన ఆస్ట్రేలియా మహిళ

  • Australia vs India: ఆస్ట్రేలియాదే వన్డే సీరీస్.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన భారత్

    Australia vs India: ఆస్ట్రేలియాదే వన్డే సీరీస్.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన భారత్

Latest News

  • Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం

  • Kohli Comments on Costly Cars: ఇష్టమొచ్చినట్టు కార్లు కొనేసా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

  • Deer-Leopard: వామ్మో.. తెలివైన జింక.. ప్రాణాలు పోయినట్లు నటించి చిరుత నుండి ఎలా తప్పించుకుందో చూడండి?

  • Rohit Sharma: ఒకప్పుడు పాల ప్యాకెట్లు డెలివరీ.. రోహిత్ శర్మ గురించి వెలుగులోకి షాకింగ్ విషయం

  • Bicycle: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్.. దీని బరువు ఎంతంటే?

Trending

    • Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

    • Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..

    • UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…

    • UPI Payments: ఇకపై upi ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: