HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Demolished Australia With An Innings And 132 Runs Defeat

IND vs AUS 1st Test Match: స్పిన్ ఉచ్చులో విలవిల.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి!

అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతున్నారు.

  • By Naresh Kumar Published Date - 02:28 PM, Sat - 11 February 23
  • daily-hunt
Test Match
Test Match

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అదిరిపోయే విజయంతో ఆరంభించింది. సొంతగడ్డపై మరోసారి పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ నాగ్ పూర్ వేదికగా ఆసీస్ ను చిత్తు చేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిలలాడారు. రెండో ఇన్నింగ్స్ లోనూ ఏ మాత్రం క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా చెలరేగితే.. రెండో ఇన్నింగ్స్ అశ్విన్ తన మ్యాజిక్ చూపించాడు. ఫలితంగా ఆసీస్ ఇన్నింగ్స్ పరాజయం చవిచూసింది.

మూడోరోజు భారత టెయిలెండర్ల బ్యాటింగ్ ఆకట్టుకుంది. రెండోరోజే హాఫ్ సెంచరీ చేసిన అక్షర్ పటేల్ తొలి సెషన్ లో దూకుడుగా ఆడాడు. జడేజా 70 రన్స్ కు ఔటైనా.. మహ్మద్ షమీ సపోర్ట్ తో భారీస్కోరును అందించాడు. ప్రధాన బ్యాటర్ లా ఆడిన మహ్మద్ షమీ కేవలం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 47 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 రన్స్ చేశాడు. షమీ, అక్షర్ 9వ వికెట్ కు 52 పరుగులు జోడించారు. సెంచరీ సాధిస్తాడనుకున్న అక్షర్ పటేల్ 80 పరుగులకు వెనుదిరగడంతో భారత్ 400 రన్స్ కు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 223 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఆసీస్ బౌలర్లలో అరంగేట్రం చేసిన స్పిన్నర్ మర్ఫీ 7 వికెట్లు పడగొట్టాడు.

తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలను అశ్విన్ దెబ్బతీశాడు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 5, ఖవాజా 10 పరుగులకే పెవిలియన్ కు పంపాడు. లబూషేన్ ను జడేజా ఔట్ చేయగా.. తర్వాత ఆసీస్ మిడిలార్డర్ సైతం అశ్విన్ స్పిన్ కు తలవంచింది. రెన్ షా 2, హ్యాండ్స్ కాంబ్ 6, అలెక్స్ క్యారీ 10 , కమ్మిన్స్ 1 పరుగుకే ఔటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్మిత్ క్రీజులో ఉన్నా టెయిలెండర్లు చేతులెత్తేయంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ కు 100 లోపే తెరపడింది. ఈ విజయంతో 4 టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఢిల్లీలో ఫిబ్రవరి 17 నుంచి జరుగుతుంది.

𝗩𝗶𝗰𝘁𝗼𝗿𝘆 𝗶𝗻 𝗡𝗮𝗴𝗽𝘂𝗿! #TeamIndia 🇮🇳 win by an innings & 1️⃣3️⃣2️⃣ runs and take a 1️⃣-0️⃣ lead in the series 👏🏻👏🏻

What a start to the Border-Gavaskar Trophy 2023 👌🏻

Scorecard ▶️ https://t.co/SwTGoyHfZx…#INDvAUS | @mastercardindia pic.twitter.com/jCVDsoJ3i6

— BCCI (@BCCI) February 11, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs AUS
  • Spin
  • test match
  • Won

Related News

Sky

Suryakumar Yadav : ఆస్ట్రేలియాపై రివేంజ్..టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌‌ ప్రత్యర్థిపై సూర్య రిప్లయ్!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి టీమిండియాను ఇంకా వెంటాడుతోంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియానే ఎదుర్కోవాలని సూర్యకుమార్ యాదవ్ కోరుకుంటున్నాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ చేదు అనుభవం నుంచి కోలుకుని, ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ కూడా ఫైనల్లో భారత్ గెలవడమే ముఖ్యమని అన్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్

  • IND vs SA

    IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియా కెప్టెన్ ఎవ‌రంటే?!

Latest News

  • Ram Charan- Sukumar: రామ్ చరణ్- సుకుమార్‌ సినిమా జాన‌ర్ ఇదేనా!

  • Insomnia: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? అది వ్యాధి కాదు!

  • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

  • Battery Tips: మీ ఈవీ బ్యాటరీ ఎక్కువ కాలం వ‌చ్చేలా చేసే టిప్స్ ఇవే!

  • Cheteshwar Pujara: క్రికెటర్ పుజారా బావమరిది ఆత్మహత్య.. కార‌ణ‌మిదే?!

Trending News

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd