West Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు అస్వస్థత
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ అస్వస్థతకు గురైయ్యారు.
- By Hashtag U Published Date - 11:00 PM, Fri - 1 April 22

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ అస్వస్థతకు గురైయ్యారు. మతువా కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ అస్వస్థతకు గురై మధ్యలోనే తిరిగి వచ్చారు. గవర్నర్ కాన్వాయ్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఠాకూర్‌నగర్ నుండి ధనఖర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్‌కు తిరిగి వచ్చింది. వైద్యుల బృందం గవర్నర్‌కి చికిత్స అందిస్తున్నారని బెంగాల్ రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.