IIT Madras International Campus : 3 దేశాల్లో.. ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లు
IIT Madras International Campus : మన ఐఐటీ మద్రాస్ ఇక ఇంటర్నేషనల్ లెవల్ కు ఎదగబోతోంది. త్వరలో దాని అంతర్జాతీయ క్యాంపస్ టాంజానియా దేశంలో ఏర్పాటు కాబోతోంది. అక్కడి జాంజిబార్ ప్రావిన్స్ పరిధిలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతున్నారు.
- By Pasha Published Date - 12:36 PM, Sun - 4 June 23

IIT Madras International Campus : మన ఐఐటీ మద్రాస్ ఇక ఇంటర్నేషనల్ లెవల్ కు ఎదగబోతోంది. త్వరలో దాని అంతర్జాతీయ క్యాంపస్ టాంజానియా దేశంలో ఏర్పాటు కాబోతోంది. అక్కడి జాంజిబార్ ప్రావిన్స్ పరిధిలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలోగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక UAE దేశంలోని అబుధాబిలో, మలేషియా రాజధాని కౌలాలంపూర్ లోనూ మరో రెండు క్యాంపస్ లను ఐఐటీ మద్రాస్ తెరవబోతోంది. అయితే మొదటిది మాత్రం టాంజానియా దేశంలోనే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఐఐటీ మద్రాస్ నుంచి ఐదుగురు ప్రొఫెసర్లతో కూడిన ప్రతినిధి బృందం టాంజానియాను సందర్శించి, క్యాంపస్ ప్రారంభం గురించి ముఖ్య అధికారులతో మాట్లాడింది.
Also read : Animal: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం కోట్లలో?
ఈ ఏడాది అక్టోబర్ నాటికి టాంజానియాలో 50 అండర్ గ్రాడ్యుయేట్ (UG), 20 పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్థులతో కూడిన బ్యాచ్ లకు క్లాస్ లను ప్రారంభించాలని ఐఐటీ మద్రాస్ ప్లాన్ చేస్తోంది. అక్కడి స్టూడెంట్స్ కు ఇన్‌స్టిట్యూట్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌లను కూడా అందించాలని భావిస్తోంది. అయితే అక్కడి క్యాంపస్ లో ఫీజులు ఎంత ఉంటాయనేది తెలియరాలేదు. కాగా, మన IITలు ఫారిన్ లో పెట్టే క్యాంపస్ లకు “ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ” (IIT Madras International Campus) అని పేరు పెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.