Plastic Bottle : ప్లాస్టిక్ బాటిల్ తెచ్చిస్తే రూ.10..
ప్లాస్టిక్ బాటిళ్లు పోగుపడకుండా సరికొత్త ఆలోచన చేసింది నగరానికి చెందిన రీసైకల్ సంస్థ 1,63,000 బాటిళ్లు..
- Author : Maheswara Rao Nadella
Date : 08-01-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్లాస్టిక్ బాటిళ్లు (Plastic Bottle) పోగుపడకుండా సరికొత్త ఆలోచన చేసింది నగరానికి చెందిన రీసైకల్ సంస్థ 1,63,000 బాటిళ్లు.. కేదార్‌నాథ్ వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అది. 50 కిలోమీటర్ల దారిపొడవునా దుకాణాల్లో శీతలపానీయాలు, నీళ్లసీసాలు పోగుపడిపోయి ఉన్నాయి. దీనికి చెక్ పెట్టాలంటూ అక్కడి జిల్లా పాలనా విభాగం.. నగరానికి చెందిన రీసైకల్ సంస్థను సంప్రదించింది. ఈ క్రమంలోనే ‘డిజిటల్ డిపాజిట్ రీఫండ్ సిస్టమ్’ (DDRS) ఆలోచనకు శ్రీకారం చుట్టి సుమారు 1,63,000 ప్లాస్టిక్ బాటిళ్లు (Plastic Bottle) సేకరించి రికార్డు సృష్టించారు.
ఏమిటీ DDRS?
DDRSలో భాగంగా పర్యాటకులు, పౌరులు ప్లాస్టిక్ వస్తువు ఏది కొనుగోలు చేసినా ఎమ్మార్పీపై రూ.10 అదనంగా చెల్లించాలి. ఇలా చెల్లించినందుకు వారికి ఓ క్యూర్‌కోడ్ స్టిక్కర్‌ను అతికించి ఇస్తారు. ఆ బాటిళ్లను మళ్లీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అదనంగా తీసుకున్న డబ్బును యూపీఐ పేమెంట్ ద్వారా రీఫండ్ చేస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి పౌర స్పృహ పెరిగింది. బాటిళ్లు పారేయట్లేదు. అక్కడి చెత్త ఏరుకునేవారు ఈ క్యూఆర్ కోడ్ బాటిళ్లను తీసుకొచ్చి ఆదాయం ఆర్జిస్తుండటం విశేషం. DDRS కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. చాలా వరకు ప్లాస్టిక్‌ను హిమాలయాల సమీపంలోని జలాశయాల్లోకి వెళ్లకుండా అడ్డుకోగలిగాం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అక్కడి స్థానిక యూనియన్లు, అసోసియేషన్లు, పౌరుల సహకారం ఎంతో ఉంది.
Also Read: Plum Fruits : భోగి పళ్లుగా రేగుపళ్లనే ఎందుకు పోయాలి?