CM Jagan: నేను కోర్టుకొస్తే ట్రాఫిక్ ఇబ్బందులొస్తాయ్: కోడికత్తి కేసులో జగన్
ఏపీలో కోడి కత్తి కేసు నేటికీ చర్చనీయాంశమవుతూనే ఉంది.
- By Balu J Published Date - 02:28 PM, Mon - 10 April 23

ఏపీలో కోడి కత్తి కేసు నేటికీ చర్చనీయాంశమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఈ కేసు గురించి మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయి. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అడ్వకేట్ కమిషనర్ ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలి” అని పిటిషన్లో జగన్ అభ్యర్థించారు. ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలంటూ మరో పిటిషన్ కూడా కూడా సీఎం దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈనెల 13న విచారణ జరుపుతామని ఎస్ఐఏ కోర్టు తెలిపింది.