Drunken Drive : స్కూల్ బస్సు డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. రెండు బస్సులు సీజ్
Drunken Drive : మహా నగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ దర్యాప్తులో ఇద్దరు స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.
- By Kavya Krishna Published Date - 05:23 PM, Wed - 18 June 25

Drunken Drive : మహా నగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ దర్యాప్తులో ఇద్దరు స్కూల్ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. మొదటి ఘటన యూసుఫ్‌గూడ బస్తీ ప్రాంతంలో జరిగింది. క్వీన్స్ , ప్రిజం పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సు డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. డ్రైవర్‌కు 156 రీడింగ్ రావడంతో అతడిపై కేసు నమోదు చేసి, బస్సును స్వాధీనం చేసుకున్నారు.
YS Sharmila: బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న.. ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
ఇంకొక ఘటన అమీర్‌పేటలో వెలుగు చూసింది. శ్రీ చైతన్య స్కూల్‌కు చెందిన బస్సు డ్రైవర్ కేశవరెడ్డికి ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అతనికి 202 మోతాదు అల్కహాల్ లెవల్ తో పట్టుబడ్డాడు. ఇది అనుమతిని మించిన స్థాయి కావడంతో బస్సును అక్కడికక్కడే సీజ్ చేశారు. ఈ ఘటనలపై ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడేలా మద్యం సేవించి బస్సు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్ లైసెన్సు రద్దు, న్యాయపరమైన చర్యలతో పాటు స్కూల్ యాజమాన్యాలపై కూడా విచారణ జరపనున్నట్లు సమాచారం. పిల్లల భద్రతపై ఎటువంటి రాజీకి తావులేదని, స్కూల్ వాహనాలపై మద్యం తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
BCCI: ఐపీఎల్ మాజీ జట్టు దెబ్బ.. బీసీసీఐకి భారీ నష్టం?