Hyderabad: ‘పీజ్ రెయిన్ స్పా’ సెంటర్ పై బంజారాహీల్స్ పోలీసుల దాడి
బంజారాహిల్స్ స్పా సెంటర్ పై బంజారాహీల్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకోగా అందులో పని చేసే ఐదుగురు మహిళలను రక్షించినట్టు పోలీసులు తెలిపారు.
- Author : Vamsi Chowdary Korata
Date : 10-07-2023 - 11:33 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: బంజారాహిల్స్ స్పా సెంటర్ పై బంజారాహీల్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకోగా అందులో పని చేసే ఐదుగురు మహిళలను రక్షించినట్టు పోలీసులు తెలిపారు.
‘పీజ్ రెయిన్ స్పా’ సెంటర్‌లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం నరేంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం ‘పీజ్ రెయిన్ స్పా’ సెంటర్ పై దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒక మేనేజర్‌ని అరెస్టు చేశారు. ఐదుగురు మహిళలను రక్షించినట్లు ఎస్‌హెచ్‌ఓ నరేంద్ర తెలిపారు. సదరు స్పా నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు అనైతిక కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ‘పీజ్ రెయిన్ స్పా’ సెంటర్ బంజారాహీల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్నది.
Read More: Earthquake : భూకంపంతో వణుకు.. కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో అలర్ట్