Independence Day 2023 : నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపిన మెట్రో
‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 59తో తమ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్ చేయడం
- Author : Sudheer
Date : 11-08-2023 - 8:01 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఇండిపెండెన్స్ డే (Independence Day 2023) సందర్బంగా నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా మెట్రో ‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్’ (Super Saver Freedom Offer) ను తీసుకొచ్చింది. కేవలం రూ. 59 లతో నగరం మొత్తం మెట్రో రైళ్లల్లో ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు. ‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్’లో భాగంగా కేవలం రూ. 59తో తమ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా ఆగస్ట్ 12, 13, 15 తేదీల్లో అపరిమిత మెట్రో రైడ్‌లను ఆస్వాదించవచ్చు’ అని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ NVS రెడ్డి శుక్రవారం (ఆగస్టు 11) ఒక ప్రకటనలో తెలిపారు. ఇండిపెండెన్స్ డేతో కూడిన ఈ వీకెండ్‌లో ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని నగరాలవాసులు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చన్నమాట.
‘ఈ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో మెట్రో ప్రయాణాన్ని మరింతగా ఆస్వాదించడానికి, మెట్రో రైళ్లలో ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రయాణీకులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందించమే కాదు.. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని ప్రోత్సహించడం, హరిత వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా నగరం మొత్తం అభివృద్ధిని ప్రోత్సహించడంలో హైదరాబాద్ మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తుంది’ అంటూ HMR ప్రకటించింది.
మరోపక్క నగరం కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు (Independence Day Celebrations) సిద్ధమైంది. పర్యాటక ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్ , బస్టాండ్ లు అన్ని కూడా లైటింగ్ అమర్చి ముస్తాబు చేస్తున్నారు. అలాగే నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున నగరంలో తనికీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.
Read Also : BRS vs Congress : బుద్వేల్ భూముల వేలంపై కాంగ్రెస్ ఆగ్రహం.. భూములు కొన్నవారంతా…?