Adilabad : నవ వధువును హత్య చేసిన భర్త..మరుక్షణమే ఆక్సిడెంట్ లో అతడు మృతి
- By Sudheer Published Date - 11:07 AM, Fri - 1 September 23
![Adilabad : నవ వధువును హత్య చేసిన భర్త..మరుక్షణమే ఆక్సిడెంట్ లో అతడు మృతి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/husband-killed-wife.jpg)
అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు..తమ కన్నబిడ్డను ఏ కష్టం రావొద్దని ప్రతిక్షణం అనుకున్నారు..ఏది అడిగితే అది లేదనుకుండా ఇస్తూ పెంచి పెద్ద చేసారు. పెళ్లి ఈడుకు వచ్చిందని ఓ మంచి అబ్బాయి చేతిలో పెట్టి పెళ్లి చేయాలనీ అనుకున్నారు. ఓ మంచి సంబంధం దొరికింది..అబ్బాయి మంచిగా ఉన్నాడు..గుణం మంచింది..అత్తమామలు మంచివారు..ఆ కుటుంబానికి వెళ్తే మన ఇంట్లోనే ఉన్నట్లే అని తల్లిదండ్రులు భావించారు. అలాగే అట్టహాసంగా పెళ్లి చేసారు.
వీరి జంటను చూసి చుట్టాలు..ఇంటి పక్కవారు అంత ఎంత బాగుందో జంట అనుకున్నారు..కానీ ఆ తర్వాత వరుడి అసలు నిజ స్వరూపం బయటపడింది. కష్టంరాకుండా చూసుకున్న కన్నా కూతుర్ని కష్టపెట్టడం మొదలుపెట్టాడు..అనుమానంతో ప్రతిరోజు చావగొట్టడం చేసాడు..అయ్యో ఇలా అవుతుందే అని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు..ఇంతలో ఆ నవ వధువును కడతేర్చాడు ఆ అనుమానపు మృగం. అతి దారుణంగా హత్య చేసి..పోలీస్ స్టేషన్లో లొంగిపోదామని ఇంటి నుండి బయలుదేరాడు..ఆలా బయలుదేరిన కాసేపట్లోనే లారీ రూపంలో మృతువు వచ్చి అతడ్ని తీసుకెళ్లింది. ఈ ఘటన ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో బుధువారం జరిగింది.
Read Also : Kushi : ఖుషి మూవీ టాక్..అబ్బాయిలు హిట్ కొట్టేసాం
బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్.. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన కొద్దీ రోజుల తర్వాత దీప (Deepa) ఫై అనుమానం (Doubt) పెంచుకోవడం స్టార్ట్ చేసాడు. ప్రతి విషయంలో ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. అనుమానంతో కొట్టడం..తిట్టడం చేస్తూ వచ్చాడు. అయితే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ పెరిగింది. ఆవేశంలో అరుణ్.. దీపను అతి దారుణంగా హత్యచేశాడు.
అనంతరం తన బైక్పై పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా మార్గమధ్యంలో మమత జిన్నింగ్ మిళ్తు ఎదుట ఆగిఉన్న లారిని వెనుక నుంచి ఢీకొట్టాడు (Accident). దీంతో తీవ్రంగా గాయపడిన అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కూతురు మృతి చెందడం..అటు కొడుకు మృతి చెందడం తో ఆ రెండు కుటుంబాల్లో విషాదం అల్లుకుంది.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Ramesh-Rathod.jpg)
Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) ఇక లేరు.