Manipur Violence: ఢిల్లీకి చేరిన మణిపూర్ పంచాయితీ
మణిపూర్ హింసని కట్టడి చేయాలనీ 40 సంస్థల ప్రతినిధుల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు.
- By Praveen Aluthuru Published Date - 05:38 PM, Sat - 24 June 23

Manipur Violence: మణిపూర్ హింసని కట్టడి చేయాలనీ 40 సంస్థల ప్రతినిధుల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు. మే 3న మణిపూర్ లో చోటు చేసుకున్న హింస కారణంగా ఇప్పటివరకు 120 మంది మరణించగా, 400 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన కారణంగా దాదాపు 50,650 మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు నిరాశ్రయులయ్యారు. కాగా.. మణిపూర్ రాష్ట్రంలోని వందలాది చర్చిలు దగ్ధం కావడంపై ఈ సంఘాలు వేదన వ్యక్తం చేశాయి.
మణిపూర్ ఘటనపై విచారం వ్యక్తం చేసిన 40 సంస్థలు ఢిల్లీలో తమ గళాన్ని విప్పారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయని తెలిపారు. మణిపూర్ ప్రజలు అనేక దశాబ్దాలుగా నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని, ఆస్తులు కాలి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మణిపూర్ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని 40 రకాల ఆ గ్రూపులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
మణిపూర్ హింస కారణంగా మహిళలు మరియు పిల్లలతో సహా 1,000 మందికి అస్సాం మరియు మిజోరాం పొరుగు ప్రాంతాలలో సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం వారు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఆహారం, దుస్తులు, నీటి వసతి విషయంలో వలస వెళ్లిన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
Read More: Opposition Meet: పాట్నా విపక్షాల మీటింగ్ పై కేటీఆర్ కామెంట్!