Ganja : కీసర టోల్‌గేట్ దగ్గర భారీగా గంజాయి స్వాధీనం
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
- By Prasad Published Date - 08:56 AM, Fri - 18 November 22

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా కంచికచర్ల పోలీసులు పట్టుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రెండుకార్లలో సుమారు 100 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.