AC in Summer: ఎండాకాలం ఏసీ వాడకుండా ఇంటిని చల్లగా ఉంచుకోవడం ఎలా..?
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు ఉదయం నుంచే ఉక్కబోత మొదలవుతుంది. రాత్రిపూట కూడా ఉక్కబోత పోస్తుంది. అలాగే తీవ్రమైన వడగాల్పులు ఉదయం నుంచే వీస్తున్నాయి.
- Author : Anshu
Date : 17-05-2023 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
AC in Summer: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు ఉదయం నుంచే ఉక్కబోత మొదలవుతుంది. రాత్రిపూట కూడా ఉక్కబోత పోస్తుంది. అలాగే తీవ్రమైన వడగాల్పులు ఉదయం నుంచే వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఎండల వేడికి అల్లాడిపోతున్నారు. దాదాపు 48 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని వాతావరణశాఖ సూచిస్తోంది.
అయితే వేసవిలో ఇంట్లో వేడి కూడా ఉంటుంది. దీంతో ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చాలామంది ఏసీలు వాడుతూ ఉంటారు. ఏసీ 24 గంటలకు ఆన్ చేసి ఉంచితే కరెంట్ బిల్లు చాలా వస్తుంది. దీని వల్ల ఏసీ కూడా త్వరగా పాడై పోయే అవకాశముంటుంది. 24 గంటలు ఏసీ వాడకుండా వల్ల వేడి ఎక్కువై త్వరగా పాడైపోతుంది. దీంతో ఏసీ వాడకుండానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంటిని కూల్ గా ఉంచుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నుంచి రాత్రి వరకు కిటికీలు తెరిచి చాలామంది రాత్రి పూట క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. ఉదయం పూట కిటికీలు తెరకపోవడమే మంచిది. ఎందుకంటే ఎండ ఇంట్లో వచ్చేస్తుంది. దీంతో ఇంట్లోని వాతావరణం వేడిగా మారుతుంది. దీంతో ఉదయం నుంచి ఎండ తగ్గేవరకు కిటికీలు తెరవకూడదు. దీని వల్ల రూమ్ చల్లగా ఉంటుంది.
ఇక కిటికీ తెరిచి ఫ్యాన్ వేచి ఉంచినా వేడి తగ్గదు. అలాగే డోర్ కర్టెన్లు కూడా ఉంచి ఉంచాలి. దీని వల్ల ఎండ వేడి ఇంట్లోకి రాదు. ఇక కిటికీకి కూలర్ గ్లాస్ లు అతికించడం వల్ల సూర్యకాంతి ఇంట్లోకి రాదు. ఇక రాత్రిపూట కిటికీలు తెరిచి ఉంచితే చల్లని గాలి ఇంట్లోకి వస్తుంది. దీని వల్ల రూమ్ చల్లగా ఉంటుంది. అలాగే ఫ్యాన్ ను హైస్పీడ్ లో కాకుండా మీడియం స్పీడ్ లో పెట్టాలి. దీని వల్ల రూమ్ చల్లగా ఉంటుంది. రూమ్ కు వేడిని ఆకర్షించే కలర్స్ వేయకూడదు. నీలం, నలుపు రంగు వేడిని ఆకర్తిస్తాయి. దీంతో అవి వేయకూడదు.
ఇక కిటికీ కర్టెన్, బెడ్ షీట్ బట్టలు తెరుపు, నారింజ రంగులను ఎంచుకోవడం మంచిది.