Asthma : వచ్చేది వర్షాకాలం…ఆస్తమా తీవ్రమవుతుది..ఈ జాగ్రత్తలు తీసుకోండి..!!
వచ్చేది వర్షాకాలం. వర్షాలతోపాటు సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఆస్తమా ఉన్నవాళ్లు ఎక్కువగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
- By hashtagu Published Date - 07:30 AM, Tue - 7 June 22

వచ్చేది వర్షాకాలం. వర్షాలతోపాటు సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఆస్తమా ఉన్నవాళ్లు ఎక్కువగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక జలుబు, ఇన్ప్లుఎంజా ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమా ప్రమాదాన్ని పెంచేస్తాయి. ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ఇది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఉబ్బసం ఉన్నవాళ్లు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం…భారత్ లో దాదాపు 10 నుంచి 20 మిలియన్ల మంది ఆస్తమా బాధితులు ఉన్నారు. చాలామంది ఆస్తమా బాధితులకు వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రం అవుతుంది. వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
సీజనల్ ఆస్తమా
వర్షాకాలంలో విపరీతమైన చలిగాలులు, ఆస్తమాను మరింత శక్తివంతం చేస్తాయి. నిరంతర తేమ శిలీంద్రాలు పెరుగుదలకు దారితీస్తాయి కాబట్టి ఆస్తమా రోగుల్లో అలర్జీని కలిగిస్తుంది. వర్షాకాలంలో వృద్ధులలో ఆస్తమా ప్రాణాంతకం కావచ్చు. అంతేకాదు యువకుల్లో కూడా వర్షాకాలంలో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. వర్షాకాలం ఆస్తమా బాధితులకు కాస్త కష్టకాలమే అని చెప్పవచ్చు. వర్షాకాలంలో ఉబ్బసం తీవ్రం అయ్యేందుకు కారణాలేంటో చూద్దాం.
వర్షాకాలంలో ఆస్తమా ఎందుకు తీవ్రం అవుతుంది…
వర్షాకాలంలో గాలిలో పుప్పొడి పరిమాణం పెరుగుతుంది. దీంతో ఆస్తమా అటాక్ ఎక్కుగా ఉంటుంది. గాలి తేమ, ఫంగస్, విపరీతమైన చలి వంటి పలు కారణాల వల్ల ఈ పుప్పొడి రేణువులు వస్తాయి. దీని దుష్ప్రభావాలు రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో సల్ఫర్, సల్ఫర్ డయాక్సైడ్ , నెట్రోజన్ డయాక్సైడ్ వంటి విషవాయువులు కలిసి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషాల వల్ల ఆస్తమా రోగులకు శ్వాస అనేది సరిగ్గా అందడం కష్టంగా మారుతుంది.
శిలీంధ్రాలు, బ్యాక్టీరియా..
నిరంతర వర్షం, చీకటి వాతావరణం వల్ల తేమ దుమ్ముతో పాటు ఫంగస్ డెవలప్ అవుతుంది. ఇది శ్వాసనాళ రుగ్మతలకు కారణం అవుతుంది. వర్షాకాలంలో రకరకాల వైరస్ లు, బ్యాక్టీరియాలు పుట్టుకొస్తాయి. ఈ వైరస్ లు, బ్యాక్టీరియాలు ఆస్తమా రోగుల్లో బహుల అలెర్జీలకు కారణం అవుతాయి. ఉబ్బసం పూర్తిగా నయం కాదు…కానీ దాన్ని నియంత్రించవచ్చు.. ఎలాగో తెలుసుకుందాం.
జీలకర్ర నీటితో ఆవిరి..
వేడి పానీయాలు తినడం మంచిది. తేనె కలిపిన టీ తాగాలి. సూప్ లు, స్పైసీ టీలు ఇష్టపడితే..వర్షాకాలంలో ఆస్తమా బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. జీలకర్ర వేసి నీళ్లు మరగించి…ఆవిరి పీల్చాలి. ఇది బ్రోన్చియల్ పాసేజ్ విస్తరించడానికి సహాయపడుతుంది. హోం ఎయిర్ కండీషనర్స్ ఫిల్టర్ లను తప్పకుండా శుభ్రం చేయాలి. వీలైతే వర్షాకాలం ప్రారంభానికి ముందే వాటిని శుభ్రం చేయాలి.
ఇండోర్ మొక్కలకు దూరంగా ఉండాలి..
వర్షాకాలంలో ఇండోర్ మొక్కలను బయట ఉంచడం మంచిది.కనీసం వారానికి రెండు సార్లు పాదాలను స్క్రబ్ చేసుకోవాలి. శుభ్రపరిచేటప్పుడు మాస్క్ ధరించండి.
పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్త..
పెంపుడు జంతువులు ఉన్నవారు ఈ సీజన్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లి లేదా కుక్క ఉంటే వాటి బొచ్చును ఎక్కువగా తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమాకు సంబంధించి అలెర్జీలకు ఇది ప్రధాన కారణాల్లో ఇది ఒకటి.
అల్లం, మిరియాలు..
అరటీస్పూన్ తేనెతో సమాన పరిమాణంలో అల్లం పొడి, ఎండుమిర్చి కలపండి. గోరువెచ్చని నీటితో త్రాగడం ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడుతుంది. 30గ్రాముల పంచాదారతోపాటు ఐదు గ్రాముల అల్లం, యాలకులు, లవంగాలు, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క కలపండి. ఈ పొడిని ఒకటీస్పూన్ తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
యూకలిప్టస్ ఆయిల్…
యూకలిప్టస్ ఆయిల్ మీ శ్వాసనాళాల్లోని శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుది. దిండుపై కొన్ని చుక్కల యూకలిప్టస్ డ్రాప్స్ వేసుకుని నిద్రపోండి. అల్లం, దానిమ్మ రసం తీసుకుని అందులో తేనె కలపండి.
అత్తిపండు…
వేడి కాఫీ, బ్లాక్ టీ శ్వాసనాళ కండరాల డెవలప్ కు సహాయపడతాయి. కానీ అది రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. కప్పు నీటిలో మూడు అంజీర పండ్లను నానబెట్టి…మరుసటిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినండి. మంచినీళ్లను ఎక్కువగా తాగాలి. అంజీర్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు..కఫాన్ని తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆస్తమాకు చాలా మేలు చేస్తాయి. వాటిని మాత్రలు రూపంలో తీసుకోవచ్చు. లేదంటే రోజూ కొన్ని వాల్ నట్స్ తీసుకోవాలి. కర్పూరంతో ఆవాల నూనెను వేడి చేయాలి. దీన్ని ఛాతీపై సున్నితంగా అప్లై చేయాలి. ఇది ఆస్తమా బాధితులకు త్వరగా ఉపశమనం లభిస్తుంది.