15 Km Traffic Jam : 15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్..18 గంటలుగా పడిగాపులు
15 Km Traffic Jam : 15 కి.మీ మేర రోడ్డు పొడవునా ట్రాఫిక్ జామ్..ఇంకో 8 గంటలు గడిస్తే కానీ ట్రాఫిక్ జామ్ క్లియర్ కాదని వెల్లడించారు..
- Author : Pasha
Date : 26-06-2023 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
15 Km Traffic Jam : 15 కి.మీ మేర రోడ్డు పొడవునా ట్రాఫిక్ జామ్..
వెంటనే అది క్లియర్ అయ్యే ఛాన్స్ లేదని అధికారులు చెప్పారు..
ఇంకో 8 గంటలు గడిస్తే కానీ ట్రాఫిక్ జామ్ క్లియర్ కాదని వెల్లడించారు..
దీంతో దాదాపు 200 మందికిపైగా టూరిస్టులు ఆందోళనకు గురవుతున్నారు..
ఈ ట్రాఫిక్ జామ్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, కులు సిటీలను కలిపే జాతీయ రహదారిపై ఏర్పడింది. ఈ రోడ్ రూట్ మొత్తం కొండ ప్రాంతంలో ఉంటుంది. రోడ్డు పక్కన మొత్తం కొండలే ఉంటాయి. భారీ వర్షం కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగి మండి-కులు జాతీయ రహదారిపై పడ్డాయి. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి ఈ హైవే బ్లాక్ అయింది. 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్(15 Km Traffic Jam) అయింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అంటే గత 18 గంటల నుంచి వీరంతా రోడ్లపైనే ఉన్నారు. ఇంకో 8 గంటలు రోడ్డుపైనే వెయిట్ చేయాలంటే ఎలా ? అని వాహనదారులు బాధపడుతున్నారు.
Also read :Kajol Agarwal : నటిగా, కూతురిగా, భార్యగా, తల్లిగా..అన్ని పాత్రలు పోషించాలంటున్న కాజల్
రోడ్డుపై పడి ఉన్న భారీ బండరాళ్లను తరలించడం కష్టం.. కాబట్టి వాటిని అధికారులు పేలుడు పదార్థాలతో బ్లాస్ట్ చేస్తున్నారు. పేలిన తర్వాత వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఇదంతా పూర్తి కావడానికి ఇంకో ఎనిమిది గంటలు పట్టొచ్చని చెబుతున్నారు. వాహనదారుల్లో దాదాపు 200 మంది పర్యాటకులే ఉన్నారు. వీరంతా దగ్గర్లో ఆహారం దొరకక.. హోటల్ రూమ్స్ దొరకక నానా అవస్థలు పడుతున్నారు. కనీసం ట్రాఫిక్ ఎప్పటిలోగా క్లియర్ అవుతుందనే క్లారిటీ కూడా అధికారులు ఇవ్వడం లేదని వాహనదారులు వాపోతున్నారు.