AP High Court:ఏపీ ప్రభుత్వ సలహాదారు శ్రీకాంత్ నియామకాన్ని నిలుపుదల చేసిన హైకోర్టు
ఏపీ ప్రభుత్వంలో దేవదాయ శాఖ సలహాదారుగా నియమితులైన జె.శ్రీకాంత్ నియామకాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
- Author : Hashtag U
Date : 24-08-2022 - 2:36 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ప్రభుత్వంలో దేవదాయ శాఖ సలహాదారుగా నియమితులైన జె.శ్రీకాంత్ నియామకాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్‌ను ఏపీ ప్రభుత్వం నియమించిన సమయంలోనే పలు సంఘాలు అభ్యంతరం తెలిపాయి. అయితే ఆ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దేవదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకం నిబంధనలకు విరుద్ధమని వారు తమ పిటిషన్లలో హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పిటిషనర్ల వాదనలు సరైనవేనని భావించిన హైకోర్టు… శ్రీకాంత్ నియామక ఉత్తర్వులపై స్టే విధించింది.