Munawar Faruqi : శిల్పకళా వేదిక వద్ద భారీ పోలీస్ బందోబస్తు.. మునావర్ షోపై ఉత్కంఠ
స్టాండ్-అప్ కమెడియన్ మునవర్ ఫరూఖీ షోపై ఉత్కంఠ నెలకొంది
- Author : Prasad
Date : 20-08-2022 - 4:06 IST
Published By : Hashtagu Telugu Desk
స్టాండ్-అప్ కమెడియన్ మునవర్ ఫరూఖీ షోపై ఉత్కంఠ నెలకొంది. షో కోసం మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక సిద్దమైందిజ అయితే బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ షోని అడ్డుకుంటామని హెచ్చరించడంతో అక్కడ పోలీసులు భారీగా మ మోహరించారు. మునావర్ అనారోగ్య సమస్య కారణంగా బెంగళూరు షో వాయిదా పడింది. ఈ రోజు హైదరాబాద్‌లో షోని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షోకి సంబంధించి టికెట్లు బుక్ అయ్యాయి. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ రోజు ప్రదర్శన ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు షో షెడ్యూల్ చేశారు. అయితే ఎమ్మెల్యే రాజా సింగ్‌తో పాటు ఆయన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టికెట్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్లు, వాటర్ బాటిల్స్‌ని లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. మునావర్ షో జరుగుతుందా లేదా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది.