Warangal: వర్షాల కారణంగా కాజీపేట రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు?
భారతదేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గంగా యమునా లాంటి భారీ నదులు పొంగిపొర్లడంతో పాటు ప్రమాదకర స
- By Anshu Published Date - 04:15 PM, Thu - 27 July 23

భారతదేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గంగా యమునా లాంటి భారీ నదులు పొంగిపొర్లడంతో పాటు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు గోదావరి నది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో నదులు కూడా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా ఉత్తరాఖండ్ లాంటి ఎగువ ప్రదేశాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటం వల్ల ఆ వరద నీరు మొత్తం నదులలో చేయడంతో ప్రస్తుతం గంగా యమునా గోదావరి నదులు ఉదృతంగా వ్యవహరిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే భారీ వర్షాల కారణంగా తాజాగా వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమయ్యింది. ముఖ్యంగా వరంగల్ లోని భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి గుడిలోకి భారీగా వరద నీరు పోటెత్తింది. దాంతో పాటుగా కాజీపేట రైల్వే స్టేషన్ వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాలు మొత్తం వర్షపు నీటితో నీట మునిగాయి. అదేవిధంగా హనుమకొండ వరంగల్ రహదారి వంతెన పై నుంచి వరద నీరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి.
వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు నిలిచింది. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమవ్వగా, పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. మైలారం వద్ద భారీ చెట్టు కూలి అధిక సంఖ్యలో వాహనాలు నిలిచాయి. మరో రెండు రోజులు జిల్లా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో.. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మొత్తానికి దేశవ్యాప్తంగా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు వందల సంఖ్యలో గ్రామాలు నీట మునుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వరద నీటి ప్రవాహం వర్షాలు ఇంకా ఎక్కువ అయ్యేలా ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.