AP Rains : ముంపు అంచున నంద్యాల
ఇటీవలే జిల్లా కేంద్రంగా మారిన నంద్యాల పట్టణంకు వరద ముంపు పొంచి ఉంది. మద్దిలేరు వాగు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రవహిస్తోంది.
- Author : CS Rao
Date : 08-09-2022 - 5:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవలే జిల్లా కేంద్రంగా మారిన నంద్యాల పట్టణంకు వరద ముంపు పొంచి ఉంది. మద్దిలేరు వాగు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రవహిస్తోంది. నంద్యాల, కర్నూలు మధ్య రహదారిపై నిర్మించిన బ్రిడ్జిపై ఏకంగా 2 అడుగుల మేర పొంగి ప్రవహిస్తోంది. నంద్యాల పట్టణం మీదుగా ప్రవహించే మద్దిలేరు ఎప్పుడైనా మీద పడొచ్చని అక్కడ జనం ఆందోళన చెందుతున్నారు. పట్టణానికి సమీపంలోని కుందూ నది కూడా పొంగి ప్రవహిస్తోంది. గంటగంటకూ మద్దిలేరు వరద ప్రవాహం పెరిగిపోతోంది. ఇప్పటికే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పట్టణానికి సమీపంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే జంబులా పరమేశ్వరి అలయానికి రాకపోకలు ఆగిపోయాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా రాయలసీమలో వాగులు, వంకలు ఏళ్ల తర్వాత జలకళను సంతరించుకున్నాయి. అదే సమయంలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతుండటంతో రాయలసీమలోని పలు పట్టణాలు ముంపు వాకిట ఉన్నాయి.