HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄Heavy Cases Of Flu Similar To Covid Advice Given By Experts

Flu: కొవిడ్ తరహాలో భారీగా ఫ్లూ కేసులు.. నిపుణులు చెప్పే సలహాలివే

కొవిడ్ భయాలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. ఈ తరుణంలోనే దేశవ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. కొవిడ్ తరహా లక్షణాలతో వస్తున్న

  • By Nakshatra Published Date - 07:10 PM, Sat - 4 March 23
Flu: కొవిడ్ తరహాలో భారీగా ఫ్లూ కేసులు.. నిపుణులు చెప్పే సలహాలివే

Flu:  కొవిడ్ భయాలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. ఈ తరుణంలోనే దేశవ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. కొవిడ్ తరహా లక్షణాలతో వస్తున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా దీర్ఘకాలం బాధిస్తున్నది. ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఈ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని ఐసీఎంఆర్ తెలిపింది.

రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. సాధారణంగా జలుబు దాదాపు ఒక వారంపాటు ఉంటుంది. కానీ, ఈ ఫ్లూ సోకిన పేషెంట్లలో రెండు, మూడు వారాలపాటు జలుబు ఉంటున్నది. అలాగే, విపరీతమైన దగ్గు ఉంటున్నది. ఫలితంగా గొంతు నొప్పి కూడా తీవ్రంగా ఉంటున్నది. వీటికితోడు జ్వరం కూడా వస్తున్నది. ఆ జ్వరమూ దీర్ఘకాలం వీడట్లేదు. కొవిడ్ తరహా లక్షణాలతో ఈ ఫ్లూ దేశవ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తున్నది. ఒక చోట నుంచి మరో చోటుకి వేగంగా వ్యాపిస్తున్నది. ఐసీఎంఆర్ దీనిపై స్పందించింది. ఇది ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ అని పేర్కొంది. కరోనా తరహా లక్షణాలు ఉండటం, దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో ఒకరకమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హెచ్3ఎన్2 వైరస్ ఇతర సబ్ టైప్‌ల కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుందని, అందుకే ఈ వైరస్ సోకడంతో చాలా మంది హాస్పిటల్‌లో చేరాల్సి వస్తున్నది. గత రెండు మూడు నెలలుగా మన దేశంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్‌ఫ్లుయెంజా సోకిన వారిలో దగ్గు, జ్వరం దీర్ఘకాలం కొనసాగుతున్నాయని వివరించారు. దీర్ఘకాలం ఈ లక్షణాలు ఉంటున్నాయని పేషెంట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండటానికి ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. కాగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం ఇబ్బడిముబ్బడిగా యాంటీబయాటిక్స్ వాడొద్దని సూచించింది. లక్షణాలు చూసి సమస్యను గుర్తించి అందుకు సంబంధించిన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని, అదేమీ లేకుండా విచక్షణారహితంగా యాంటీ బయాటిక్స్ రిఫర్ చేయడం సరికాదని, ఇది ఇతర సమస్యలకు దారి తీస్తుందని తెలిపింది.

అయితే ఫ్లూ సోకిన వ్యక్తి నుంచి ఇతర కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వాళ్లకు సులభంగా అది వ్యాపించే ముప్పు ఉంటుంది. కాబట్టి, ఫ్లూ సోకిన పేషెంట్‌ను కనీసం ఒక వారంపాటు ఐసొలేషన్‌లో ఉంచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, వారు మాస్క్ ధరించడం మంచిదని వివరిస్తున్నారు.

Telegram Channel

Tags  

  • covid
  • flu
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Covid In Pregnancy : కోవిడ్ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే కడుపులో బిడ్డకు ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

Covid In Pregnancy : కోవిడ్ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే కడుపులో బిడ్డకు ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

దేశంలో కరోనా (COVID-19) మరోసారి విజృంభిస్తోంది. తాజాగా ఓ పరిశోధనలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి, గర్భధారణ సమయంలో SARS-CoV-2 ఇన్ఫెక్షన్ ఉన్న తల్లులకు జన్మించిన పిల్లలు డెలివరీ తర్వాత మొదటి 12 నెలల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్‌లతో బాధపడుతున్నారు.

  • Covid Cases: దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

    Covid Cases: దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

  • Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు

    Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు

  • XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్

    XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్

  • COVID-19: మళ్లీ కరోనా కలకలం.. 4 నెలల గరిష్టానికి కేసులు.. ఒకేరోజు 841 మందికి ఇన్ఫెక్షన్

    COVID-19: మళ్లీ కరోనా కలకలం.. 4 నెలల గరిష్టానికి కేసులు.. ఒకేరోజు 841 మందికి ఇన్ఫెక్షన్

Latest News

  • Ramakoti: రామకోటి రాయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి?

  • World Cup 2023: పాక్ కోసం బాంగ్లాదేశ్ లో ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఇది నిజమేనా..?

  • Smartwatches: రూ.3 వేలకే అద్భుతమైన స్మార్ట్ వాచ్ లు.. ఫీచర్స్ అదుర్స్ ?

  • Bhadrachalam History: భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి చరిత్ర..!

  • Delhi Capitals: రిషబ్ పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్‌..?

Trending

    • Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

    • Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..

    • UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…

    • UPI Payments: ఇకపై upi ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: