1700 Buildings Destroyed : ఆ టౌన్ 80 శాతం కాలి బూడిదైంది.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు
1700 Buildings Destroyed : అమెరికాలోని హవాయి రాష్ట్రం లహైనా టౌన్ శివార్లలోని అడవుల్లో చెలరేగిన భీకర కార్చిచ్చు జనావాసాలకు వ్యాపించి ఇప్పటివరకు 53 మందిని బలిగొంది.
- By Pasha Published Date - 07:14 AM, Fri - 11 August 23
1700 Buildings Destroyed : అమెరికాలోని హవాయి రాష్ట్రం లహైనా టౌన్ శివార్లలోని అడవుల్లో చెలరేగిన భీకర కార్చిచ్చు జనావాసాలకు వ్యాపించి ఇప్పటివరకు 53 మందిని బలిగొంది. ఎంతోమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. ఈ మంటల ధాటికి 1,700 ఇళ్లు కాలిపోయాయి. ఈ వివరాలను మావీ కౌంటీ అధికారులు ధృవీకరించారు. హరికేన్ ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. దీనివల్ల లహైనా పట్టణంలో 80% కనుమరుగైందని వెల్లడించారు. టౌన్ లోని ఏ వీధిలో చూసినా దట్టమైన పొగ అలుముకొని కనిపిస్తోంది. వేలాది మందిని తాత్కాలిక షెల్టర్ హోమ్స్ కు తరలించారు. 11,000 మంది లహైనా టౌన్ ప్రజలు ఇప్పటికీ విద్యుత్ లేకుండా చీకటిలో మగ్గుతున్నారు. ఎన్నో కార్లు కూడా ఈ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈనేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. లహైనా టౌన్ కార్చిచ్చును పెను విపత్తుగా ప్రకటించారు. సహాయక చర్యలకు నిధులను రిలీజ్ చేశారు.
Also read : Today Horoscope : ఆగస్టు 11 శుక్రవారం రాశి ఫలితాలు.. వారిపై ఒత్తిళ్లు అధికం
మంగళవారం రాత్రి నుంచే ఈ కార్చిచ్చుతో లహైనా టౌన్ (1700 Buildings Destroyed) సతమతం అవుతోంది. ఈ టౌన్ లో 16 రోడ్ల పరిధిలో మంటలు అలుముకున్నాయి. దీంతో వాటిని మూసేశారు. ఇప్పుడు లహైనా టౌన్ ను కనెక్ట్ చేసే ఒకే ఒక్క హైవే తెరిచి ఉంది. ఆ మార్గంలోనే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ కార్చిచ్చు నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొందరు లహైనా టౌన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలోకి కూడా దూకారని వార్తలు వస్తున్నాయి.
Tags
Related News
46 Dead : అగ్నివిలయానికి 46 మంది బలి.. కాలి బూడిదైన 1100 ఇళ్లు
46 Dead : చిలీ దేశంలోని అడవుల్లో సంభవించిన కార్చిచ్చు కారణంగా శుక్రవారం నుంచి ఇప్పటివరకు దాదాపు 46 మంది చనిపోయారు.