MLA Harish Rao : శ్రీతేజ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు
భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలి..
- By Latha Suma Published Date - 06:19 PM, Thu - 26 December 24

MLA Harish Rao : కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం సాయంత్రం పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ను పలుకరించి, ధైర్యంగా ఉండాలని సూచించారు. శ్రీతేజ్‌ను పరామర్శించిన వారిలో కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నవీన్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భవగవంతుడిని ప్రార్థిస్తున్నాను. శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు చెప్పారు.
శ్రీతేజ్ కు స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి. సినిమా వాళ్లను భయపెట్టి సీఎం రేవంత్ మంచి చేసుకోకూడదు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఓ సర్పంచ్ ఆత్మహత్యకు కారకుడైన సీఎం సోదరుడిని ఎందుకు అరెస్టు చేయలేదు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. గురుకులాల్లో మృతి చెందిన పిల్లల కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఇంత వరకు పరామర్శించలేదు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించారు అన్నారు. దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను కేసీఆర్ గారి సూచనతో పరామర్శించాం..అన్నారు.
Read Also: Siraj-Bumrah: బెయిల్స్ మార్చిన సిరాజ్.. వికెట్ తీసిన బుమ్రా