Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ లోగో ఆవిష్కరణ
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. పాత జట్లతో పాటు ఈసారి రెండు కొత్త జట్లు ఈ టోర్నీలో ఎంట్రీ ఇవ్వనున్నాయి.
- By Naresh Kumar Published Date - 08:09 AM, Mon - 21 February 22

ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. పాత జట్లతో పాటు ఈసారి రెండు కొత్త జట్లు ఈ టోర్నీలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్, ఓపెనర్ కే.ఎల్. రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తొలిసారి లీగ్ లో అడుగుపెట్టాయి. ఇప్పటికే వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ తమ టీమ్ లోగోను విడుదల చేసింది. మెటావర్స్ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేసిన ఈ లోగోలో టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కనిపించారు. వర్చువల్ స్పేస్ ద్వారా ముగ్గురు ప్లేయర్లను చూపించింది.
బంగారపు వర్ణం, వైట్ అండ్ బ్లూ రంగుల్లో పిరమిడ్ షేప్ లో కనిపించింది లోగో. మెటావర్స్ లో టైటాన్స్ డగౌట్ నుంచి లోగో లాంచ్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను పోస్టు చేసింది గుజరాత్. డగౌట్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, శుబ్‌మన్ లోగో లాంచ్ గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటల తర్వాత లోగో లాంచ్ అవుతుండగా చిందులేసి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా వీడియో రూపొందించారు.గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ హార్ధిక్ తో పాటు శుభ్‌మన్ గిల్, రషీద్‌ఖాన్‌లను రిటైన్ చేసుకుంది. అలాగే వేలంలో ఏకంగా రూ. 52 కోట్లు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. షమీ, జాసన్ రాయ్, లాకీ ఫెర్గ్యూసన్ రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా ఆ జట్టులో ఉన్నారు. ముందు అహ్మదాబాద్ పేరుతో బిడ్ వేసి 5,625 కోట్లతో కొనుగోలు చేసిన సీవీసీ గ్రూప్ తర్వాత గుజరాత్ టైటాన్స్ గా పేరు మార్చుకుంది.