Samantha: వందసార్లు పడినా.. నాకు నేనే లేచాను : సామ్ ఇంట్రస్టింగ్ పోస్ట్!
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సమంత అగ్రకథాయికలలో ఒకరిగా కొనసాగుతోంది. ఓవైపు వరుసపెట్టి సినిమాలు చేస్తూనే...మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ అదే జోరు చూపిస్తోంది సామ్.
- By Hashtag U Published Date - 10:29 AM, Sat - 29 January 22

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సమంత అగ్రకథాయికలలో ఒకరిగా కొనసాగుతోంది. ఓవైపు వరుసపెట్టి సినిమాలు చేస్తూనే…మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ అదే జోరు చూపిస్తోంది సామ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్, వర్కవుట్ వీడియోస్ తో పాటు మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది సమంత. తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఒక వీడియోతో పాటు, మోటివేషనల్ కొటేషన్ ను పోస్ట్ చేసింది. అందులో సామ్ ఏం రాసిందంటే… నేను వందసార్లు పడిపోయాను… కానీ లేచి నిల్చున్నాను. వదిలేయాలని ఆలోచన వచ్చినా… వదిలిపెట్టలేదు అంటూ ఇంట్రెస్టింగ్ గా చెప్పుకొచ్చింది. దీంతో సమంత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సామ్ షేర్ చేసిన వీడియోలో స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం…
అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా కేరీర్ పైనే దృష్టిపెట్టింది సామ్. ఓవైపు సినిమాలు చేస్తూనే… తనకు నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తోంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో సమంత పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ స్కీయింగ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ వస్తుంది. స్కీయింగ్ కోసం తాను ఎంత కష్టపడ్డది చెప్పే ప్రయత్నం చేసింది సమంత. తాను స్కీయింగ్ కోసం దాదాపు 10 రోజులపాటు, రోజుకు 5 నుంచి 6 గంటల పాటు ప్రాక్టీస్ చేసినట్లుగా తెలిపింది. స్కీయింగ్ కోసం తాను పడిన పాట్లను చూపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
“నేను బన్నీ వాల్ పై నా స్కీయింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాను. వందసార్లు పడిపోయాను. పడిన ప్రతిసారీ లేచాను.. వదిలేయాలనే ఆలోచన చాలాసార్లు నా మదిలోకి వచ్చింది. కానీ సంతోషంగా ముందుకు సాగాను. బన్నీ స్లోప్ ల నుంచి రెడ్ రన్ పూర్తి చేయడానికి పట్టిన సమయం.. దాని కోసం నేను చేసిన కృషిలో నిజమైన ఆనందాన్ని కనుగొన్నాను. ఊహించని విధంగా ఇది ఉత్సాహంగా ఉంది ” అంటూ మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆక్ట్రెస్ సమంత చెప్పుకొచ్చింది. అలాగే ఇన్ స్టా లో తనకు స్విట్జర్లాండ్లోని వెర్బియర్ స్కీ రిస్టార్ట్ లో స్కీయింగ్ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షకురాలు కేట్ మెక్బ్రైడ్కు ధన్యవాదాలు తెలిపుతూ ఆ ఫొటోను తన అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.