US Predator Drone Deal: అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకి ఆమోదం తెలిపిన భారత రక్షణ శాఖ?
తాజాగా భారత రక్షణ శాఖ అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్
- By Anshu Published Date - 05:30 PM, Thu - 15 June 23

తాజాగా భారత రక్షణ శాఖ అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ ఒప్పందానికి తాజాగా ఆమోదం తెలిపింది. కాగా ఈ కొనుగోలు ప్రక్రియకు ముందు ఈ డీల్ భద్రత కు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. యుఎస్ కు చెందిన జనరల్ అటామిక్స్ ఈ ప్రిడేటర్ డ్రోన్ లను తయారు చేసింది. తాలిబాన్ ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ డ్రోన్ లు అత్యంత విజయవంతం అయ్యాయి.
అధిక ఎత్తులో ప్రయాణించే లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లు స్ట్రైక్ క్షిపణులను కలిగి ఉంటాయి. అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల లక్ష్యాలను సైతం ఇవి ఛేదించగలవు. కాగా ఈ డ్రోన్ లను దేశ సరిహద్దుల్లో సముద్ర ప్రాంతాల్లో సుదూర నిగా కోసం ఉపయోగించనున్నారు. భారత నావికాదళం ఈ ఒప్పందానికి ప్రధాన ఏజెన్సీగా ఉంది. ఇందులో 15 డ్రోన్లు వాటి బాధ్యత నిగా కార్యకలాపాల కోసం ఇండియన్ నావికే వెళ్లనున్నాయి. అయితే డ్రోన్లను సైన్యంలోని మూడు విభాగాలకు సమానంగా పంపిణీ చేసి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చర్చల్లో MQ-9B సీ గార్డియన్ డ్రోన్లను అమెరికాకు చెందిన జనరల్ అటామిక్స్ అనే రక్షణ సంస్థ తయారు చేసింది. MQ – 9, 8 లేజర్ గైడెడ్ క్షిపణులను ఎయిర్ టూ గ్రౌండ్ మిస్సైల్ 114 హెల్ ఫైర్ ద్వారా అత్యంత కచ్చితంగా టార్గెట్లను ధ్వంసం చేయగలదు. యాంటీ ఆర్మర్ యాంటీ పర్సనల్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం భారత వద్ద రెండు ప్రిడేటర్ డోన్లు ఉన్నాయి. వీటిని ఒక అమెరికన్ సంస్థ నుంచి లీజుకు తీసుకున్నారు. వీటిని భారత రక్షణ శాఖ హిందూ మహాసముద్రం పై నిఘా కోసం వాడుతున్నారు.