HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Good News For Shopping Enthusiasts

Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

  • Author : Vamsi Chowdary Korata Date : 21-05-2026 - 3:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good News for Shopping Enthusiasts
Good News for Shopping Enthusiasts

ఇప్పటి వరకు బైక్ కావాలంటే ర్యాపిడో, కార్ కావాలంటే ఓలా, ఆకలి వేస్తే జొమాటో వంటి ఎన్నో రకాల డెలివరీ యాప్స్‌ను చూశాం. కానీ షాపింగ్ చేస్తూ భారీ బ్యాగులు మోయలేక ఇబ్బంది పడేవారి కోసం ఇప్పుడు మార్కెట్లోకి సరికొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ‘మీరు నచ్చింది కొనండి.. మీ బరువులు మేం మోస్తాం’ అంటూ ప్రయాణాన్ని సులువు చేసే ఒక వినూత్న కాన్సెప్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

క్యారీమెన్ ఆసరా

ఢిల్లీకి చెందిన ‘క్యారీమెన్’ అనే స్టార్టప్ సంస్థ ఈ క్రేజీ ఐడియాను తెరపైకి తెచ్చింది. సరోజినీ నగర్, లజపత్ నగర్ వంటి రద్దీ మార్కెట్లలో షాపింగ్ చేసేవారికి సాయంగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన అసిస్టెంట్లను ఈ సంస్థ అందిస్తోంది. గంటకు రూ.149, అరగంటకు రూ.79 చొప్పున చెల్లించి రెండు నుంచి నాలుగు గంటల ప్యాకేజీల కింద వీరిని బుక్ చేసుకోవచ్చు. వీరు కస్టమర్ల వెంటే ఉంటూ షాపింగ్ బ్యాగులను మోస్తారు.

ఫోల్డింగ్ చైర్ సదుపాయం

ఈ సర్వీస్ ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లల తల్లులు, వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక అసిస్టెంట్ గరిష్ఠంగా 12 కిలోల బరువు వరకు మోస్తారు. షాపింగ్ చేస్తూ అలసిపోతే కూర్చోవడానికి వీరు ఫోల్డింగ్ కుర్చీలను కూడా వెంట తెస్తారు. అంతేకాదు ఎండ, వానల నుంచి రక్షణకు గొడుగులు, మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు, తాగడానికి నీళ్లను కూడా ఈ అసిస్టెంట్లు అందిస్తారు. అదనపు ఛార్జీతో చిన్న పిల్లల కోసం స్ట్రోలర్లను కూడా అద్దెకు ఇస్తున్నారు.

పేలుతున్న జోకులు

ఈ సరికొత్త కాన్సెప్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ ఐడియాను మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘మా షాపింగ్ బ్యాగుల బరువు సరే.. మాకున్న ఎమోషనల్ బరువును కూడా వీరు మోస్తారా?’’ అని ఒకరు జోక్ చేయగా.. ‘‘మార్కెట్ రద్దీలో పెళ్లి లెహంగాలు, కాస్ట్‌లీ శారీస్ బ్యాగులతో వీరు పారిపోతే పరిస్థితి ఏంటి?’’ అని ఇంకొందరు భద్రతా పరమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • Delivery Service
  • Shopping

Related News

    Latest News

    • Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

    • Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

    • Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

    • Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని

    • Ys Jagan: మా తాతను, నాన్నను, చిన్నాన్నను చంపింది ఎవరు?

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd