HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gold Seizures By Dri Nearly Doubled In A Year

Gold Seizures: రికార్డు స్థాయిలో గోల్డ్ స్వాధీనం.. 1450 కిలోలకు పైగా బంగారం పట్టుకున్న డీఆర్‌ఐ..!

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో బంగారాన్ని స్వాధీనం (Gold Seizures) చేసుకుంది.

  • Author : Gopichand Date : 05-12-2023 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold- Silver Return
Gold- Silver Return

Gold Seizures: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో బంగారాన్ని స్వాధీనం (Gold Seizures) చేసుకుంది. సోమవారం 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ఇస్తూ.. DRI ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ మోహన్ కుమార్ సింగ్.. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022-23 గణాంకాలను ఉటంకిస్తూ భారతదేశంలో బంగారం స్మగ్లింగ్ ఇప్పటికీ ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

దేశవ్యాప్తంగా 275 కేసుల్లో 1450 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఆర్‌ఐ తెలిపింది. గతేడాది సీజ్ చేసిన పరిమాణం కంటే ఈ పరిమాణం రెట్టింపు. 2020-21 సంవత్సరంలో DRI 833 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే డ్రగ్స్ తగ్గుముఖం పట్టిందని మోహన్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 522 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో మొత్తం రూ.11,500 కోట్ల స్మగ్లింగ్ స్వాధీనం చేసుకుమన్నారు.

Also Read: Congress MLAs: మంత్రి పదవీ ప్లీజ్.. క్యాబినెట్ పోస్టులపై టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాబీయింగ్!

వీటిలో 1,300 కిలోల హెరాయిన్, 150 కిలోల కొకైన్, 250 కిలోల మెథాంఫెటమైన్, 25 మెట్రిక్ టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఐ ఈ సంవత్సరం గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ నుండి 3,463 కిలోల హెరాయిన్, 26,946 మెట్రిక్ టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అన్ని పరిశోధనలు పూర్తి చేసేందుకు ప్రచారం ప్రారంభించామని, ఇప్పటి వరకు 944 కేసుల దర్యాప్తును పూర్తి చేశామని డీఆర్‌ఐ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Directorate of Revenue Intelligence (DRI)
  • DRI
  • DRI Gold Seizure
  • gold
  • Gold Seizures
  • Smuggling In India Report

Related News

Gold Price Fall

Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గడం విశేషం. మార్చి ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 5400 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్, ప్రస్తుతం 5150 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. దేశీయంగా కూడా 22 క్యారెట్ల బంగారం ధర మార్చి 1తో పోలిస్తే సుమారు రూ. 9,800 వరకు తగ్గి, ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,48,850 వద్ద ట్రేడవుతోంది. యుద్ధం తీవ్రతరమైనా

  • Gold Shop Offers

    War Effect : రండి బాబు..రండి..డిస్కౌంట్ లో బంగారం ..క్రేజీ ఆఫర్లు ప్రకటిస్తున్న నగల షాపులు

Latest News

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd