Gold Price Today: రోజు రోజుకి పెరుగుతున్న ధరలు.. నేడు 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,400గా నమోదైంది.
- By Gopichand Published Date - 06:59 AM, Sat - 6 May 23
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,400గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.83,700కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (మే 06, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Operation Kaveri: విజయవంతమైన “ఆపరేషన్ కావేరీ”.. సూడాన్ నుంచి భారత్ చేరుకున్న 3800 మంది ఇండియన్స్..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,550గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.62,400 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,450గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,250 ఉండగా, ముంబైలో రూ.78,250గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.83,700 ఉండగా, కోల్కతాలో రూ.78,250గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.83,700 ఉండగా, కేరళలో రూ.83,700గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.83,700 ఉండగా, విజయవాడలో రూ.83,700 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Gold- Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్త.