Gold Price Today: మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాలలో 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,180గా నమోదైంది.
- By Gopichand Published Date - 07:10 AM, Fri - 5 May 23
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,180గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.82,800కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (మే 05, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,330గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,730గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,180గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,230గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,100 ఉండగా, ముంబైలో రూ.77,100గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.82,800 ఉండగా, కోల్కతాలో రూ.77,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.82,800 ఉండగా, కేరళలో రూ.82,800గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.82,800 ఉండగా, విజయవాడలో రూ.82,800 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Gold- Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్త.