Gold And Silver Price Today: బంగారం కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్.. నేటి ధరలు ఇవే..!
దేశంలో బంగారం, వెండి ధరలు (Gold And Silver Price Today) శనివారం తగ్గాయి. శనివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,160గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి.
- Author : Gopichand
Date : 11-02-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలో బంగారం, వెండి ధరలు (Gold And Silver Price Today) శనివారం తగ్గాయి. శనివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,160గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.72,500 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (ఫిబ్రవరి 11, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,310గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,040గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,160 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,210గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,160గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,160గా ఉంది.
Also Read: Flipkart Sale: ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ పై భారీ ఆఫర్.. ధర, ఫీచర్స్ ఇవే?
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,800 ఉండగా, ముంబైలో రూ.70,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, కోల్‌కతాలో రూ.70,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, కేరళలో రూ.72,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, విజయవాడలో రూ.72,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.