Godavari : భద్రాచలం వద్ద 58 అడుగులకు చేరిన గోదావరి నీట్టం
భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది.
- By Prasad Published Date - 09:34 AM, Thu - 14 July 22

భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం గోదావరి వద్ద నీటిమట్టం 58.50 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగించారు. ఇదిలా ఉండగా ప్రమాద హెచ్చరికను మించి ఐదు అడుగులకు పైగా నీరు ప్రవహిస్తోంది, వరద ప్రవాహం కరకట్టపైకి రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో ముంపు మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన దాదాపు 4,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, కాళేశ్వరం వద్ద గోదావరి ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ప్రవహిస్తోంది.