Hilarious Video: వారెవ్వా…ఏటీఎం ముందు అమ్మాయి తీన్మార్ స్టెప్పులు..ఎందుకో తెలుసా..!!
జీవితంలో మనం ఎన్ని విజయాలు సాధించినా...మొదటి ఉద్యోగం అందించే సంతోషం ఇంకేది ఇవ్వదు.
- By Hashtag U Published Date - 08:52 PM, Fri - 29 April 22

జీవితంలో మనం ఎన్ని విజయాలు సాధించినా…మొదటి ఉద్యోగం అందించే సంతోషం ఇంకేది ఇవ్వదు. అందులోనూ మొదటిసారిగా జీతం తీసుకుంటే…ఆ ఆనందానికి హద్దే ఉండదు. మొదటిసారి జీతం చేతికి వచ్చినప్పుడు ఆ కిక్కే వేరుంటుంది. అదే అమ్మాయిలు మొదటిసారి జీతం తీసుకుంటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేరు. కానీ ఓ అమ్మాయి మాత్ం ఏకంగా ఏటీఎం ముందే డ్యాన్స్ చేసింది. డబ్బు చేతుల్లోకి రాగనే…ఏటిఎంకు దండం పెడుతూ తీన్మార్ స్టెప్పులు వేసింది. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇప్పుడా వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
బ్లాక్ డ్రెస్ ధరించి..ముఖానికి మాస్క్ పెట్టుకున్న ఓ యువతి ఏటిఎం నుంచి డబ్బుల డ్రా చేసింది. అయితే ఆ అమ్మాయి డబ్బులు డ్రా చేస్తూ…సంతోషం తట్టుకోలేక ఏటీఎం ముందే తీన్మార్ స్టెప్పులేసింది. అలా కాసేపు డ్యాన్సు చేసిన ఆ యువతి చివరకు ఏటిఎం దండం పెట్టింది. ఈ సీన్ అంతా కూడా సీసీకెమెరాలో రికార్డు అయ్యింది.
Related News

Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కోసం ఫ్రెంచ్ రివేరాకు చేరుకుంది.