Ghulam Nabi Azad : ముగ్గురు సీనియర్లపై గులాంనబీ ఆజాద్ వేటు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో..!
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ నుంచి ముగ్గుఉరు సీనియర్లను సస్పెండ్ చేశారు.
- Author : Prasad
Date : 23-12-2022 - 7:19 IST
Published By : Hashtagu Telugu Desk
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ నుంచి ముగ్గుఉరు సీనియర్లను సస్పెండ్ చేశారు. ముగ్గురు అగ్రనేతలను తారా చంద్, మనోహర్ లాల్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్‌లను సస్పెండ్ చేశారు . వీరిని బహిష్కరిస్తూ తక్షణమే డిఎపి ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ చిబ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిని బహిష్కరించామని.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పార్టీలో వారి అవసరం లేదని ప్రధాన కార్యదర్వి తెలిపారు. గులాం నబీ ఆజాద్ జమ్మూలో పార్టీని స్థాపించారు. అయితే దాదాపు మూడు నెలల తర్వాత DAP చైర్మన్ ఆజాద్ గత రెండు రోజులుగా పార్టీలో అనేక నియామకాలు చేశారు.