Gali Janardhan Reddy: కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి విజయం
గాలి జనార్ధన్ రెడ్డి 2 వేలకు పైగా ఓట్ల మోజారిటీతో విజయం సాధించారు.
- By Balu J Published Date - 03:54 PM, Sat - 13 May 23

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy) సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన గంగావతి స్థానం నుంచి పోటీ చేయగా, 2 వేలకు పైగా ఓట్ల మోజారిటీతో విజయం సాధించారు. అయితే ఆయన భార్య గాలి లక్ష్మి అరుణ మాత్రం బళ్లారి నుంచి ఓటమి పాలయ్యారు. బీజేపీను వీడి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అని ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు నలభై ఐదు స్థానాల్లో పోటీ చేశారు.
ఒక్క గంగావతిలో తప్ప.. మిగతా 14 స్థానాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీనే ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఒకప్పటి గాలి అనుచరుడు బీజేపీ ముఖ్య నేత, మాజీ మంత్రి శ్రీరాములు ఈ సారి బళ్లారి రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు రామనగర నుంచి పోటీ చేసిన కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార గౌడ ఓటమి పాలయ్యారు.
Also Read: Bandi Sanjay: బండికి బిగ్ షాక్.. ప్రచారం చేసినా చోటా బీజేపీ ఘోరపరాజయం!