Four woman die: జలపాతంలో పడి నలుగురు యువతులు మృతి..!
సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి నలుగురు యువతులు మృతి చెందారు.
- By Gopichand Published Date - 05:07 PM, Sat - 26 November 22

సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడి నలుగురు యువతులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని కితవాడ జలపాతంలో దగ్గర శనివారం ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని ఉజ్వల్ నగర్‌కు చెందిన ఆసియా ముజావర్ (17), అనగోలాకు చెందిన కుద్షియా హసం పటేల్ (20), రుక్కాషర్ భిస్తీ (20), జత్‌పత్ కాలనీకి చెందిన తస్మియా (20) మరణించారు. కర్ణాటకలోని బెళగావికి చెందిన 40 మంది యువతులు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని కితవాడ జలపాతానికి విహారయత్రకు వెళ్లారు. సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడిపోయారు.
మృతులను ఉజ్వల్ నగర్‌కు చెందిన అసియా ముజావర్ (17), అనగోలాకు చెందిన కుద్షియా హసం పటేల్ (20), రుక్కాషర్ భిస్తీ (20), జత్‌పత్ కాలనీకి చెందిన తస్మియా (20)గా గుర్తించారు. బెళగావికి చెందిన 40 మంది యువతులు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులోని కితవాడ జలపాతానికి విహారయాత్రకు వెళ్లారు. ఈ పర్యటనలో ఐదుగురు మహిళలు సెల్ఫీ తీసుకుంటూ జారిపడ్డారు. ఐదుగురు యువతుల్లో నలుగురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. మృతదేహాలను బెలగావిలోని ఆసుపత్రికి తరలించారు.